బెజవాడలో గజగజ..సీఐని సస్పెండ్‌ చేయాలంటూ.. నడిరోడ్డుపై నల్లకోటు నిరసన..

|

Mar 21, 2023 | 7:16 PM

ర్యాదును నిర్లక్ష్యం చేశారంటూ అడ్వోకేట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. .. ..సీఐ ఉమర్‌,ఏ ఎసై గంగాధర్‌ను ను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు.

బెజవాడలో గజగజ..సీఐని సస్పెండ్‌ చేయాలంటూ..  నడిరోడ్డుపై నల్లకోటు నిరసన..
Vijayawada Lawyers
Follow us on

బెజవాడలో లాయర్ వర్సెస్ పోలీస్ వార్ తారాస్థాయికి చేరింది…లాయర్ భగవాన్ కుమార్తెపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులకు న్యాయవాదులకు మధ్య గొడవ ఒక్కసారిగా నగరాన్ని కుదిపేసింది..భవాని పురం సీఐ ఉమర్ ను,ఏ ఎసై గంగాధర్ ను సస్పెండ్ చెయ్యాలని నిన్న ఐదు గంటలపాటు రోడెక్కిన లాయర్లు ఇవ్వాల్టి నుండి విధులు బహిష్కరించారు…మరో పక్క సిఐ ఉమర్ ను రొండు రోజుల పాటు వీఆర్ పై పంపారు నగర పోలీస్ కమిషనర్.

లాయర్స్‌ వర్సెస్‌ పోలీస్‌.. బెజవాడలో ఈ గొడవ మొదలై 2వారాలు దాటింది. భవానీపురంలో పార్క్‌లో మైనర్‌ అమ్మాయితో ఓ కుర్రాడు అసభ్యంగా ప్రవర్తించాడనే వివాదం చినికి చినికి ఇలా రచ్చగా మారింది. తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని అడ్వోకేట్‌ భగవాన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే భగవాన్‌ అతని మనుసులు తమపై దాడి చేశారని పిల్లాడి పేరెంట్స్‌ కూడా పోలీసులకు కంప్లేంట్‌ చేశారు.

అలా మొదలైన ఈ ఇష్యూ కాస్తా పోలీసులు వర్సెస్‌ లాయర్లుగా మారింది. ..బాలికను లైంగికంగా వేధించిన మైనర్ పై ఫిర్యాదు చెయ్యటానికి వెళ్లిన లాయర్ పైనే సీఐ ఉమర్ ఏఎసై గంగాధర్ కేసు పెట్టారని… ఫిర్యాదును నిర్లక్ష్యం చేశారంటూ అడ్వోకేట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. .. ..సీఐ ఉమర్‌,ఏ ఎసై గంగాధర్‌ను ను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు.

ఇవి కూడా చదవండి

వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీపీ నిజానిజాలు తెలుసుకునే పనిలో పడ్డారు…అసలేం జరిగింది ఎవరు చెప్తున్నా మాటల్లో వాస్తవం ఉంది అని విచారించి చర్యలు తీసుకోనున్నారు. సిఐ ను సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదంటున్నారు బెజవాడ లాయర్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..