Landslide: విరిగి ఇళ్ల మీద పడుతోన్న కొండచరియలు.. బిక్కుబిక్కుమంటూ బెజవాడ బ్రతుకులు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడుతున్నాయి. కొండపై గూడుకట్టుకొని ఉండే ప్రజలు
Landslide – Vijayawada: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడుతున్నాయి. పేదరికంతో కొండపై గూడు కట్టుకొని ఉండే కుటుంబాలు సహా దిగువ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షానికి విజయవాడలోని సొరంగం, చెరువు సెంటర్, ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ఇళ్లపై పడ్డాయి.
అదృష్టవశాత్తూ ఇవాళ ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా స్వల్ప ఆస్తినష్టం ఏర్పడింది. క్రీస్తురాజు పురం, సొరంగం, చెరువు సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో ఆందోళన చెందుతున్నారు.
ఇవే ప్రాంతాల్లో గతేడాది కొండ చరియలు విరిగిపడి చాలా ప్రమాదాలు సంభవించాయి. అయితే అధికారులు తూతూమంత్రంగా వచ్చి హడావిడి చేయడం తప్ప, నియంత్రణా చర్యలు ఇప్పటికి తీసుకోలేదని టీవీ9తో మొరపెట్టుకుంటున్నారు స్థానికులు. ప్రస్తుతం రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.
Read also: Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది