Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది

పెళ్లి కుమారుడు.. పెండ్లి కుమార్తె వివాహ మండపంలో లేరు. అయిన వారి వివాహం సంప్రదాయబద్దంగా వేద మంత్రాలు బంధువుల సమక్షంలో

Wedding: పెళ్లికొడుకు.. పెళ్లికుమార్తె మండపంలో లేరు.. అయినా సాంప్రదాయబద్ధంగా వివాహం జరిగిపోయింది
Online Wedding Kurnool
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 14, 2021 | 9:08 PM

Online Wedding: పెళ్లి కుమారుడు.. పెండ్లి కుమార్తె వివాహ మండపంలో లేరు. అయినా వారి వివాహం సంప్రదాయబద్దంగా వేద మంత్రాలు బంధువుల సమక్షంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అందేంటి వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు కుమార్తె లేకుండా వివాహం ఎలా జరిగిందని సందేహ పడుతున్నారా.. అయితే ఆ వివరాల్లోకి వెళ్దాం..

కరోనా నేపథ్యంలో ఆన్ లైన్‌లో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం మనం చుశాం. అదే తరహలో వివాహాలు సైతం ఆన్ లైన్‌లో జరుగుతున్నాయిప్పుడు. కర్నూలుకు చెందిన మధుసూదన్ రెడ్డి శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజిత. తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి – కవితల కుమారుడు దినేష్ రెడ్డిల వివాహం కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్ లైన్లో జరిగింది.

రజిత – దినేష్ రెడ్డిలకు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే, వారిద్దరూ ఉద్యోగ రిత్యా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉండడంతో కరోనా నేపథ్యంలో వివాహం జరగలేదు. ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేనందున ఆన్ లైన్లో వివాహం జరిపించే విధంగా డిసైడయ్యారు.

పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఆస్ట్రేలియాలో కల్యాణ మండపంలో ఉండి కర్నూలులో వేద పండితుడు చరవాణిలో తెలిపిన విధంగా అచరించారు. పెండ్లిలో తమ కుమార్తె, కుమారుడు లేనందున బాధగా ఉన్నా.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వివాహం ఇలా జరిపించామని వివాహ పెద్దలు తెలిపారు.

నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు ప్రతినిధి

అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
అర్ధరాత్రి అదో మాదిరి శబ్దాలు, నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
వామ్మో..! ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు..!
వామ్మో..! ప్రభుత్వాస్పత్రిలో మాయమవుతున్న శవాలు..!
ప్రియుడి చిత్రహింసలతో విసిగి ఎయిర్ ఇండియా పైలట్ ఆత్మహత్య,
ప్రియుడి చిత్రహింసలతో విసిగి ఎయిర్ ఇండియా పైలట్ ఆత్మహత్య,
MPC, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు రేపట్నుంచి కౌన్సెలింగ్
MPC, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు రేపట్నుంచి కౌన్సెలింగ్
మన జేబులో ఉండే కరెన్సీ నోట్ల తయారీ అదిరే టెక్నాలజీ
మన జేబులో ఉండే కరెన్సీ నోట్ల తయారీ అదిరే టెక్నాలజీ
క్రేజ్ పీక్.. అవకాశాలు వీక్.. ఆ భామలు క్యాష్‌ చేసుకోలేకపోతున్నారా
క్రేజ్ పీక్.. అవకాశాలు వీక్.. ఆ భామలు క్యాష్‌ చేసుకోలేకపోతున్నారా
వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్
వరుసగా సినిమాలు చేస్తానన్న ఐకాన్ స్టార్
ఏపీలో కేసుల విషయంలో నలిగిపోతున్న అధికారులు.. వైసీపీ వార్నింగ్
ఏపీలో కేసుల విషయంలో నలిగిపోతున్న అధికారులు.. వైసీపీ వార్నింగ్
2025లో రాశిని మార్చుకోనున్న రాహుకేతులు..వీరు పట్టిందల్లా బంగారమే
2025లో రాశిని మార్చుకోనున్న రాహుకేతులు..వీరు పట్టిందల్లా బంగారమే
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే వీటిని తినకండి
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. మందులు తీసుకుంటుంటే వీటిని తినకండి