AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే.. చివరికి సీన్ సితారయ్యింది

చనిపోయిన వ్యక్తి బ్రతికున్నట్లుగా సృష్టించి ఏకంగా నలభై కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు నిందితుడు చిక్కడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి మీరూ లుక్కేయండి.

Guntur: తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే.. చివరికి సీన్ సితారయ్యింది
Andhra News
T Nagaraju
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 23, 2025 | 1:27 PM

Share

ఆమె పేరు కొత్తపల్లి పద్మజ. గుంటూరు నగరంలో నివసించే ఆమె.. 2022 ఫిభ్రవరిలో క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. ఆమె పేరు మీద గోరంట్ల పంచాయితీ పరిధిలో 1.80 ఎకరాల భూమి ఉంది. నగర పరిధిలో ఉండే భూమి అత్యంత విలువైనది. సుమారు నలభై కోట్ల రూపాయల విలవైన భూమిపై మాఫియా కన్ను పడింది. ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు ఎనివేర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. పద్మజ చనిపోయినా తప్పుడు పత్రాలు సృష్టించి ఆమె జీపీఏ చేసినట్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. వాటిని నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. ఈ తతంగమంతా 2023 అక్టోబర్‌లో పూర్తి చేశారు. జీపీఏ తయారు కావడంతోనే మాఫియా ఆ భూమిని అమ్మకానికి పెట్టింది. ఏకంగా జీపీఏ సాయంతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ రిజిస్ట్రేషన్ల్నీ కూడా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన పద్మజ భర్త శ్రీనివాసరావు తమ భూమిపై కబ్జా రాయుళ్లు కన్నేశారన్న విషయాన్ని 2024లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతోనే పోలీసులు శ్రీనివాసరావు ఫిర్యాదుపై దృష్టి పెట్టలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితుడు మంత్రి లోకేష్ కార్యాలయానికి వెళ్లి భూ మాఫియాపై ఫిర్యాదు చేశాడు. లోకేష్ ఆదేశాలతో కదలిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలభై కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి విక్రయించిన మాఫియాలో కింగ్ పిన్ అయిన మహేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా మహేష్ రెడ్డి అన్ని విషయాలు బయటపెట్టాడు. చనిపోయిన పద్మజ స్థానంతో ఒక వితంతువును తీసుకొచ్చి ఆమె పద్మజ అన్నట్లు నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమ్మించారు. ఆమె పేరు మీదే జీపీఏలు ఉన్నట్లు సబ్ రిజస్ట్రార్‌కు చెప్పారు.

వీటి ఆధారంగా భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పు జరిగినట్లు గుర్తించిన అప్పటి సబ్ రిజిస్ట్రార్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరోవైపు మహేష్ రెడ్డిపై ఐదు చీటింగ్ కేసులున్నాయని నల్లపాడు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని కొద్దికాలం కిందట కబ్జా చేసేందుకు మహేష్ రెడ్డి, అతడి అనుచరులు ప్రయత్నాలు చేశారు. సీసీ కెమెరాల్లో కబ్జా ప్రయత్నాలు రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు మహేష్ రెడ్డిని గుర్తించి అరెస్ట్ చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కబ్జా అయిన తన భూమి తిరిగి తనకు దక్కడంపై భూ యజమాని శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేశాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..