మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..

| Edited By: Jyothi Gadda

Jan 22, 2025 | 6:06 PM

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌ వాసులు మృతి చెందారు. మంగళవారం రాత్రి వేద పాఠశాల విద్యార్థులు మంత్రాలయం నుంచి హంపికి తుఫాన్‌ వాహనంలో బయలుదేరారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత రాయచూరు జిల్లా సింధనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో వాహనం టైర్‌ పంక్చర్‌ కావటంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనం నుజ్జునుజ్జయింది. డ్రైవర్‌ శివ, ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో..

మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
Road Accident
Follow us on

వేద పండితులుగా స్థిరపడాలనుకున్నారు. ఆధ్యాత్మికులకు సేవ చేయాలనుకున్నారు..కానీ, ఆ చిన్నారుల కల… కలగానే మిగిలిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారిని కబళించివేసింది. మంత్రాలయం వేద పాఠశాల కు చెందిన నలుగురు వేద విద్యార్థులతో సహా మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉంది. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, డ్రైవర్ శివ కర్నాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైరు పేలి పల్టీలు కొట్టడంతో ఐదు గురుసుజయింద్ర, అభిలాష, హైవదన, డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు..

కర్నాటక లోని కొప్పళ జిల్లా ఆనేగొంది శ్రీ రఘనందనతీర్థ ఆరాధనోత్సవాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆరాధన ఉండడంతో రాత్రి మంత్రాలయం నుంచి తుఫాన్ వాహనం లో డ్రైవర్ తో 11 మంది బయలుదేరారు. కర్నాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో తుఫాన్ వాహనం టైరు పేలి రొడ్డు పై పల్టీలు కొట్టడంతో ఊహించని విధంగా ఘోర ప్రమాదం జరిగింది…

ప్రమాదానికి గురైన వారంతా మంత్రాలయం కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..