AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sepak Takraw: పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడా కుసుమం.. సెపక్ తక్రా ఆటలో పలు పతకాలు

ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఎదిగాడు. 15సార్లు ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఉంటూ అంతర్జాతీయ స్థాయికి చేరాడు. అంతర్జాతీయ క్రీడాకారుడిగా పలు అవార్డులు అందుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన 11 వ జాతీయ సేపక్ తక్రా జట్టులో మధుకి స్థానం దొరికింది. ఆ స్థానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకొన్నారు. చక్కగా 11వ జాతీయ స్థాయి ఆటలో ప్రతిభ కనబరచాడు.

Sepak Takraw: పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడా కుసుమం.. సెపక్ తక్రా ఆటలో పలు పతకాలు
Sepak Takraw Player Madhu
J Y Nagi Reddy
| Edited By: Surya Kala|

Updated on: Sep 28, 2024 | 8:58 PM

Share

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని అంటారు కొందరు. అలా పట్టుదలతో ప్రతి రోజు సాధన చేసి సెపక్ తక్రా ఆటలో రాణించాడు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు మధు అనే యువకుడు. పలు పోటీల్లో పతకాలు సాధిస్తున్న మధుపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆలూరులో బసవరాజు సరస్వతి దంపతులు జీవనోపాధికి పాస్ట్ పుడ్ సెంటర్ నడుపుతున్నారు. వారికి మధు అనే కుమారుడు. హోటల్ తల్లితండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. సెపక్ తక్రా ఆట ఆడుతూ స్థానిక వ్యాయమ ఉపాధ్యాయుల చొరవ తో జిల్లా స్థాయి ఆటగాడిగా ఎదిగాడు.

ఆలూరులో డిగ్రీచదువుతూ జిల్లా స్థాయి నుంచి వివిధ రాష్ట్రాలలో జరిగే పోటీలకు ఎంపిక అయ్యాడు. పలు పతకాలు సాధించారు. అటలో మధు పలు మెలవకులతో ముందుకు వెళ్ళాడు. ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఎదిగాడు. 15సార్లు ఆంధ్ర జట్టు కెప్టెన్ గా ఉంటూ అంతర్జాతీయ స్థాయికి చేరాడు. అంతర్జాతీయ క్రీడాకారుడిగా పలు అవార్డులు అందుకున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన 11 వ జాతీయ సేపక్ తక్రా జట్టులో మధుకి స్థానం దొరికింది. ఆ స్థానాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకొన్నారు. చక్కగా 11వ జాతీయ స్థాయి ఆటలో ప్రతిభ కనబరచాడు.

జాతీయస్థాయి నుంచి అంతర్జాతీయస్థాయికి.

ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఆటలో ప్రతిభ కనబరిచిన మధు అంతర్జాతీయ స్థాయి ఆటగాడి వరకు వెళ్ళాడు. గత నెలలో చైనాలోనే కింగ్ డా వో లో జరిగిన బీచ్ సెపక్ తక్రా జట్టులో వివిధ రాష్ట్రాలనుంచి ఎంపిక అయిన క్రీడాకారులలో మధు పలు మెళకువలతో జట్టును ముందుకు తీసుకొని వెళ్ళాడు. చైనా, కొరియా, ఇరాక్, జట్లను ఓడించారు. ఇండియా జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఫైనల్ లో థాయిలాండ్ జట్టు తో భారత్ తలపడింది. ఫైనల్ మ్యాచ్ లో ధాయిల్యాండ్ చేతిలో ఓడిపోయి రన్నర్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో భారతజట్టు ఓడినా మధు ప్రతిభ అక్కడ ఉన్న వివిధ దేశాల క్రీడాకారులను ఆకట్టుకుందని మధు కోచ్ లు గర్వంగా చెప్పారు. ఏది ఏమైనా కరువుసీమ క్రీడాకరుడు మధు అంతర్జాతీయ స్థాయి ఆటలో రాణించడం.. ఆలూరు వాసిగా ఉండడం ఎంతో మంది క్రీడాకారులకు అనందగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..