AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodali Nani: వచ్చే ఎన్నికల్లో TDP గెలిచే సీట్లు ఎన్నంటే..? ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ కోడాలి నాని జోస్యం

గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి టీడీపీ తన వైపునకు తిప్పుకుందని..అందుకే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యిందని కోడాలి నాని అన్నారు. ఇదే దేవుడి స్క్రిప్ట్‌గా ఎద్దేవా చేశారు.

Kodali Nani: వచ్చే ఎన్నికల్లో TDP గెలిచే సీట్లు ఎన్నంటే..? ఇది దేవుడి స్క్రిప్ట్ అంటూ కోడాలి నాని జోస్యం
Kodali Nani
Janardhan Veluru
|

Updated on: Mar 29, 2023 | 6:38 PM

Share

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ సభ్యుల క్రాస్ ఓటింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టిన టీడీపీ… వచ్చే ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమవుతుందని మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. అయితే వైసీపీకి నమ్మక ద్రోహం చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలవబోరని జోస్యం చెప్పారు. అక్కడో ఇక్కడో నలుగురు మాత్రమే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుస్తారని వ్యాఖ్యానించారు.

గతంలో వైసీపీ నుంచి ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి టీడీపీ తన వైపునకు తిప్పుకుందని..అందుకే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యిందని కోడాలి నాని అన్నారు. ఇదే దేవుడి స్క్రిప్ట్‌గా ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని తెలిసినా.. సీఎం జగన్ ధైర్యంగా ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. నమ్మక ద్రోహం చేసినా జగన్ టిక్కెట్ ఇవ్వబోనని స్పష్టంగా వారికి చెప్పారని.. చంద్రబాబు అయితే మాటలతో ప్రలోభాలకు గురిచేసేవారని ఎద్దేవా చేశారు.

కాగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం రోజైనా ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పై సమాధానం చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.  మేము ప్రజా బలంతో వచ్చామని .. మీలా బాబాయ్‌ ని హత్య చేసి కేసులకోసం ఢిల్లీ చుట్టూ తిరగడం లేదంటూ కొడాలి నాని వ్యాఖ్యలకు బుచ్చయ్య కౌంటరిచ్చారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..