Chandrababu – PK: అధికారమే లక్ష్యం! ఏపీలో హైహీట్ పాలిటిక్స్.. చంద్రబాబుతో భేటీ తర్వాత పీకే ఏమన్నారంటే..?
చంద్రబాబు-చండీయాగం ఏపీలో ఎంత హాట్ టాపిక్‌గా మారిందో.. బాబు, పీకే భేటీ అంతకంటే ఆసక్తిని రాజకీయ రచ్చను రేపింది. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. టాక్ ఆఫ్ ఏపీగా మారింది. అయితే దానిపై అప్పుడే వైసీపీ నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. ఆ PK అయినా, ఈ PK అయినా టీడీపీని బతికించలేరంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. ఇంతకీ చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీలో మతలబు ఏంటి? దైవ బలం, వ్యూహ బలాన్ని నమ్ముకుని జగన్‌పై బాబు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యారా?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం చేస్తున్నారు. దేవతలారా దీవించండి అంటూ వాళ్ల ఆశీర్వాదం కోరుకుంటున్నారు. యాగమే మార్గం.. అధికార యోగమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళుతున్నారా? ప్రత్యర్థి పార్టీలు మాత్రం అదే విమర్శ చేస్తున్నాయి. అధికార యోగం కోసమే చంద్రబాబు యాగాలు చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్న వేళ.. ఉరుము లేని పిడుగులా చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం.. ఏపీ రాజకీయ వర్గాల్లో బోలెడు చర్చను, రచ్చను రేపింది.
ఏపీలో పరిస్థితులపై చర్చ
ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుతో చర్చించారు. దేశంలో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తిని రేపింది.
మొన్న చండీ యాగం మొదలుపెట్టిన.. చంద్రబాబు లేటెస్టుగా ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమవడం వెనుక రాజకీయ యోగం కోరుకోవడమే కారణం అంటున్నాయి ప్రత్యర్థి పక్షాలు. ఇక పీకేతో చంద్రబాబు భేటీపై అధికార వైసీపీ నుంచి కౌంటర్లు, సెటైర్లు బుల్లెట్లలా దూసుకొస్తున్నాయి. గతంలో బీహార్ డెకాయిట్ అంటూ తిట్టిన పీకేను ఇప్పుడు తమకు వ్యూహకర్తగా పనిచేయాలంటూ ఢిల్లీకి వెళ్లి బతిమలాడి మరీ తెచ్చుకున్నారంటూ చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు వేశారు.
వైసీపీ కౌంటర్..
ఆ పీకే అయినా ఈ పీకే అయినా టీడీపీని బతికించలేరన్నారు అంబటి. ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి పోస్టుమార్టం మాత్రమే చెయ్యగలుగుతారంటూ సెటైర్లు వేశారు. ఆ పీకే మీద నమ్మకం లేక ఈ పీకేను తెచ్చుకున్నాంటూ చంద్రబాబును ఉద్దేశించి ఘాటు కామెంట్లు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇక ఇద్దరు పీకేలు వచ్చినా చేసేదేం లేదన్నారు మంత్రి జోగి రమేష్.
ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే..?
కాగా.. చంద్రబాబుతో భేటీ ముగిశాక తిరిగి వెళుతూ ఇది మర్యాద పూర్వకమైన భేటీ అన్నారు ప్రశాంత్ కిషోర్. అటు చండీయాగంతో దైవ బలం.. ఇటు పీకేతో వ్యూహ బలం చేకూరుతుందనే నమ్మకంతోనే జగన్‌పై చంద్రబాబు ఎన్నికల యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..