
సీఎం జగన్‌పై కోడికత్తి దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసుకు సంబంధించి కోర్టులో ఎన్ఐఏ అఫిడవిట్ దాఖలు చేసింది. కోడికత్తి దాడి ఘటనలో కుట్రకోణం లేదని క్లారిటీ ఇచ్చింది ఎన్ఐఏ. మరోవైపు.. కోడికత్తి దాడి ఘటనలో రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు సంబంధం లేదని తేల్చింది ఎన్ఐఏ. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని.. వ్యక్తిగతంగానే జగన్‌పై దాడి చేశాడని కోర్టుకు తెలిపింది.
కోర్టులో విచారణ ప్రారంభమైనందున.. దర్యాప్తు అవసరం లేదన్న ఎన్‌ఐఏ.. దాడి కేసులో జగన్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. అయితే.. తదుపరి వాదనలకు సమయం కావాలని జగన్ తరుపు లాయర్లు విజ్ఞప్తి చేయడంతో.. విచారణను ఈ నెల 17కి వాయిదా చేసింది కోర్టు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..