AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanigiri: పండ్లు అమ్ముకునే వ్యక్తికి కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా.. మెరుస్తూ..

రోడ్డు మీద రూపాయి కనిపిస్తే వదలని రోజులు ఇవి. అలాంటిది బంగారం దొరికితే తిరిగి ఇస్తారా. అస్సలు ఇవ్వరు. ప్రస్తుతం బంగారం ధర ఎంతలా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము కదా. ఇలాంటి సందర్భాల్లో నిజాయతీగా వ్యవహరించే వారు చాలా అరుదు. కానీ ఓ సాధారణ పండ్ల వ్యాపారి...

Kanigiri: పండ్లు అమ్ముకునే వ్యక్తికి కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా.. మెరుస్తూ..
Kanigiri Fruit Vendor(representative image)
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2025 | 3:08 PM

Share

ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకున్న ఓ చిన్న సంఘటన ఇప్పుడు అందరి నోళ్లలో చర్చగా మారింది. డబ్బు కోసం ఏదైనా చేసే ఈ కాలంలో కూడా, నిజాయతీకి విలువ తగ్గలేదని నిరూపించాడు ఒక సాధారణ పండ్ల వ్యాపారి. తన వద్ద మరిచిపోయిన రూ.7 లక్షల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదుతో ఉన్న సంచిని ఎలాంటి ఆశ లేకుండా పోలీసులకు అప్పగించి, షేక్ గౌస్ బాషా అందరికీ ఆదర్శంగా నిలిచారు. కనిగిరి పట్టణంలోని ఐస్‌పాల్‌ కూడలిలో రోజూ పండ్లు అమ్ముకునే గౌస్ బాషా దుకాణానికి బేతంశెట్టి మల్లయ్య అనే వ్యక్తి వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. కొనుగోలు ముగించుకుని వెళ్లిపోయేటప్పుడు మల్లయ్య తన చేతిసంచిని అక్కడే మరిచిపోయారు. కొంతసేపటికి ఆ సంచిని గమనించిన గౌస్ బాషా, దానిని యజమానికి తిరిగి ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే అప్పటికే మల్లయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఆ సంచిని తెరిచి చూసిన గౌస్ బాషా.. అందులో బంగారు ఆభరణాలు మరియు రూ.50 వేల నగదు ఉన్నట్లు గమనించారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ సంచిని తీసుకుని నేరుగా కనిగిరి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి అప్పగించారు.

పోలీసులు ఆ సంచిని పరిశీలించగా, దానిలో ఉన్న వస్తువులు, వివరాల ఆధారంగా అది బేతంశెట్టి మల్లయ్యదేనని నిర్ధారించారు. అనంతరం డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఎస్‌ఐ తి. శ్రీరామ్‌లు మల్లయ్యకు సంచిని తిరిగి అందజేశారు. గౌస్ బాషా చూపిన నిజాయతీని అధికారులు అభినందించారు. ఆయనను పూలమాలతో సత్కరించి ప్రశంసించారు. ఈ సంఘటనతో కనిగిరి ప్రజలు గౌస్ బాషాను నిజాయతీకి నిదర్శనంగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు దొరికినా ఆశపడకుండా తిరిగి ఇచ్చిన గౌస్ బాషా వంటి మనుషుల వల్లే సమాజంపై ఇంకా నమ్మకం మిగిలి ఉంది అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Gaus Basha With Police

Gaus Basha With Police

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్