Kamna Jethmalani: సినీ ఇండస్ట్రీకి దూరమైనా కామ్నాకు తగ్గని క్రేజ్.. రాజమండ్రిలో సందడి..

రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో డివైడర్ల మధ్యలో ఎంపీ భరత్, కామ్నా జెఠ్మలానీలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలో చెట్లు నాటే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు హీరోయిన్ కామ్నా.

Kamna Jethmalani: సినీ ఇండస్ట్రీకి దూరమైనా కామ్నాకు తగ్గని క్రేజ్.. రాజమండ్రిలో సందడి..
Kamna Jethmalani
Follow us
Pvv Satyanarayana

| Edited By: Surya Kala

Updated on: Jul 22, 2023 | 3:13 PM

ఉమ్మడి తూర్పుగదావరి జిల్లాలోని ప్రముఖ నగరం రాజమహేంద్రవరంలో సినీ నటి కామ్నా జెఠ్మలానీ సందడి చేసింది. రాజమహేంద్రవరం ఎంపి ఆధ్వర్యం లో జగనన్న హరిత నగరాలు పేరుతో రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిర్వహించిన యువత హరిత కార్యక్రమంలో కామ్నా జెఠ్మలానీ పాల్గొన్నారు. యువత హరిత కార్యక్రమానికి హాజరైన సినీనటి కామ్నా జెఠ్మలానీ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులతో అభివాదం చేశారు.

అనంతరం రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో డివైడర్ల మధ్యలో ఎంపీ భరత్, కామ్నా జెఠ్మలానీలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలో చెట్లు నాటే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు హీరోయిన్ కామ్నా. గోదావరి అందాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు కామ్నా జెఠ్మలానీ. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భారత్ కూడా పాల్గొన్నారు. భవిష్యత్తులో కావలసింది ఆక్సిజన్.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు ఎంపీ భరత్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..