Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ

Guntur Jinnah Tower: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. దీంతోపాటు దానికి త్రివర్ణ రంగులు వేసి

Jinnah Tower: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపుపై క్లారిటీ ఇచ్చిన జీఎంసీ
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 24, 2022 | 7:02 AM

Guntur Jinnah Tower: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని జిన్నా టవర్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవల జిన్నా టవర్ పేరు మార్చాలని.. దీంతోపాటు దానికి త్రివర్ణ రంగులు వేసి జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే కూల్చివేస్తామంటూ హెచ్చరించడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. జిన్నా టవర్‌కు త్రివర్ణ రంగులు వేసి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేయడంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలో తాజాగా.. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను తొలగించారన్న వార్తలు మళ్లీ కలకలం రేపాయి. జాతీయ జెండాను తొలగించారన్న నేపథ్యంలో క్రమంలో కార్పొరేషన్ (guntur municipal corporation )అధికారులు అప్రమత్తమై దీనిపై క్లారిటీ ఇచ్చారు. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండాను తొలగించలేదని.. ఎత్తుపెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జీఎంసీ కమిషనర్ నిషాంత్ కుమార్ స్పష్టంచేశారు. గతంలో 40 అడుగుల ఎత్తులో ఉన్న (National Flag) జెండాను 60 అడుగులకు పెంచుతున్నామని.. పాత దిమ్మె స్థానంలో కొత్తగా కాంక్రీట్ వేసి బెస్‌మెంట్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నా టవర్‌ వద్ద జాతీయ జెండా విషయంపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని కమిషనర్‌ సూచించారు. దిమ్మె పనులు గురువారం మధ్యాహ్నానికి పూర్తవుతాయని.. వెంటనే కొత్త జెండాను ఏర్పాటు చేస్తామని నిశాంత్ కుమార్ తెలిపారు.

బుధవారం పనులను పర్యవేక్షించిన అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ.. జిన్నా టవర్‌ గుంటూరుకే కాకుండా దేశానికే ఐకాన్‌ అని పేర్కొన్నారు. జెండా దిమ్మె బేస్మెంట్‌ పనుల కోసం నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులతో పాత జెండా దిమ్మెను తొలగించి కొత్తది బలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే.. గత సోమవారం, మంగళవారం రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి నివాళిగా ప్రభుత్వం ప్రకటించిన సంతాప దినాల్లో జిన్నా టవర్‌ వద్ద జాతీయ జెండాను అవనతం చేశామని పేర్కొన్నారు. కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని, అపొహలకు గురికావొద్దని సూచించారు.

Also Read:

AP CRIME: ఉపాధ్యాయుడి కీచక పర్వం.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ.. ఎవరికీ చెప్పొద్దంటూ

AP Crime News: అత్యాశ అసలుకే మోసం తెచ్చింది.. రూ. కోట్లు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ సంస్థ..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్