Theft in Temple: గుడిలో అమ్మవారు ఎవరికీ చెప్పలేరని భావించిన దొంగోడి ప్లాన్‌.. కానీ, మూడో నేత్రం పట్టేసింది..!

కొండ పట్టణంలో ప్రఖ్యాత ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయంలో మధ్యాహ్నం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించిన దొంగ... గర్భగుడి తాళాలు పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడో సీన్ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.

Theft in Temple: గుడిలో అమ్మవారు ఎవరికీ చెప్పలేరని భావించిన దొంగోడి ప్లాన్‌.. కానీ, మూడో నేత్రం పట్టేసింది..!
Atp Temple Chori

Updated on: Jul 10, 2022 | 10:44 AM

Jewelry theft : మనం జేబు దొంగలను చూసాం..చైన్ స్నాచర్ లను చూసాం..ఆలయాలలో హుండీ లు కొల్లగొట్టే వారినీ చూసాం..కానీ అనంతపురం జిల్లా ఉరవకొండలో దేవుడి పై ఉన్న ఆభరణాలు, నగలను పట్టపగలే కొల్లగొట్టాడు ఓ కంత్రీ గాడు. మనుషులయితే అరిచి గోల చేస్తారు. దేవుడైతేనే బెటర్ అని అనుకున్నాడో ఏమో గానీ దేవతా విగ్రహం పై ఉన్న 12కేజీ ల వెండి ఆభరణాలు మొత్తం మూటగట్టుకుని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా ఉరవకొండలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు.. పట్టపగలే దేవాలయానికి కన్నం వేశాడు. కొండ పట్టణంలో ప్రఖ్యాత ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయంలో మధ్యాహ్నం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించిన దొంగ… గర్భగుడి తాళాలు పగలగొట్టి ఏకంగా అమ్మవారి పై ఉన్న ఆభరణాలు మొత్తం దోచుకెళ్లాడు. దాదాపుగా 12.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. దొంగ ఆలయంలో ప్రవేశించి చోరికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. చోరీ విషయం పై సమాచారం అందుకున్న ఉరవకొండ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి