Andhra Pradesh: రాజమండ్రి కంబాల చెరువు వద్ద గణతంత్ర వేడుకలు.. కళ్లు చెదిరిపోయేలా కంబాల చెరువు వద్ద ఏర్పాట్లు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాల చెరువు వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద వినూత్న రీతిలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. స్థానిక సర్పం గాంధీ బొమ్మ వద్ద 76 జాతీయ జెండాలను చిన్నారులతో ఎగురవేయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐరన్ రూపులతో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక మహా సందేశ్ సంస్థ ట్రస్ట్ చైర్మన్..

Andhra Pradesh: రాజమండ్రి కంబాల చెరువు వద్ద గణతంత్ర వేడుకలు.. కళ్లు చెదిరిపోయేలా కంబాల చెరువు వద్ద ఏర్పాట్లు..
Kambala Cheruvu Park

Edited By: Jyothi Gadda

Updated on: Jan 26, 2025 | 9:51 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాల చెరువు వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద వినూత్న రీతిలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. స్థానిక సర్పం గాంధీ బొమ్మ వద్ద 76 జాతీయ జెండాలను చిన్నారులతో ఎగురవేయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐరన్ రూపులతో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహా సందేశ్ సంస్థ ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులు దేశభక్తిని పెంపొంది, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలా వినూత్నంగా జెండాలు ఎగరవేసే కార్యక్రమాలు నిర్వహిస్తామని ట్రస్ట్ చైర్మన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..