Pawan Kalyan-PM Modi: ప్రధాని పై జనసేనాని ప్రశంసల వర్షం.. ఉక్కు సంకల్పం, నాయకత్వ పటిమ మోదీకే సొంతం!

|

Nov 14, 2022 | 2:02 PM

తాజాగా జనసేనాని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ సమావేశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశానని అన్నారు.

Pawan Kalyan-PM Modi: ప్రధాని పై జనసేనాని ప్రశంసల వర్షం.. ఉక్కు సంకల్పం, నాయకత్వ పటిమ మోదీకే సొంతం!
Pm Modi And Pawan Kalyan
Follow us on

ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. హోటల్ ఐఎన్ఎస్ చోళలో మోడీ, పవన్ కళ్యాణ్ ను సమావేశం అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏమి మాట్లాడకున్నారా అని ఎవరికీ వారు ఊహాగానాలు చేస్తున్నారు కూడా. తాజాగా జనసేనాని సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ సమావేశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీని ఎనిమిది సంవత్సరాల తరవాత మళ్ళీ కలిశానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, సమస్యలను వివరించేందుకు అత్యంత విలువైన సమయాన్ని కేటాయించిన  ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు. ఈ సమావేశాన్ని సమన్వయపరచిన ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలని చెప్పారు పవన్ కళ్యాణ్.

అంతేకాదు జనసేన అధినేత తనకు ఇష్టమైన శేషేంద్ర శర్మ చెప్పిన కవితా పంక్తులను ఉటంకిస్తూ.. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ .. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ప్రస్థానానికి అద్దంపడతాయన్నారు. క్లిష్ట సమయంలో దేశ ప్రధానిగా పాలన చేపట్టి..  ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు అన్నింటినీ అర్థం చేసుకొని అన్నిటిని సమానంగా ఆదరించి.. ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావనను నింపారని హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

 

అంతేకాదు దేశంలో  ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోడీ అంటూ.. కరోనా సమయంలో ప్రధాని తీసుకున్న చర్యలను.. సరిహద్దుల విషయంలో చేపట్టిన విధానాలను ప్రశంసించారు జనసేనాని..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..