Pawan Kalyan: మోడీ మరిన్ని విజయాలు సాధించాలి.. ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జన సేనాని
Narendra Modi Birthday: జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధానిగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, మోడీ నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగోందాలని ఆకాంక్షించారు.

Narendra Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (సెప్టెంబర్ 17) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పలు దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) మోడీకి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధానిగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, మోడీ నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగోందాలని ఆకాంక్షించారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన అజేయ రాజకీయ విజేయుడు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన అసామాన్యమైన భారతదేశపు ప్రధాన మంత్రిగా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో మనం ఊహించవచ్చు. ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన దార్శనికత, ప్రధాన మంత్రిగా క్లిష్టమైన, సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు ఆయనను రాజకీయవేత్తగా అగ్రపథాన నిలిపాయి’
‘ అలాగే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కాశ్మీర్ కు సంబంధించిన 370 అధికరణం, ట్రిపుల్ తలాక్ రద్దులు, పౌరసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అమలు వంటివి ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలుగా చెప్పవచ్చు. భారతీయ ఔన్నత్యం, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రధాన మంత్రిగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగొందాలని కోరుకుంటున్నాను. మోడీ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని తెలిపారు పవన్ కల్యాణ్.




శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan #HappyBdayModiJi pic.twitter.com/og2N5HNeQg
— JanaSena Party (@JanaSenaParty) September 17, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..
