AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్గందం, దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూడగా షాక్

అమ్మా నాన్నల మరణంతో ఆ తోబుట్టువులు మనో వేదనకు గురయ్యారు. ఇంట్లో నుంచి బయటకు రావడమే మనేశారు. చీకట్లోనే బతుకుతున్నారు.

Anantapur: ఓ ఇంటి నుంచి విపరీతమైన దుర్గందం, దుర్వాసన.. ఏంటా అని స్థానికులు వెళ్లి చూడగా షాక్
Strange Incident (representative image)
Ram Naramaneni
|

Updated on: Sep 17, 2022 | 1:59 PM

Share

Andhra Pradesh: అనంతపురం నగరంలో ఓ కుటుంబం వింత ప్రవర్తన చర్చనీయాంశమైంది.  గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఇంటిలోని కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదు. సదరు ఇంటికి  పవర్, వాటర్ సప్లై నిలిపివేసినప్పటికీ ఎవ్వరూ బయట అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆ ఇంటి దుర్వాసన రావడంతో లోపలికి వెళ్లిన స్థానికులు కంగుతిన్నారు. లోపల ముగ్గురు కుటుంబ సభ్యులు(అన్న తిరుపాల్‌శెట్టి, ఇద్దరు సోదరీమణులు విజయలక్ష్మి, కృష్ణవేణి ) దుర్వాసన, దుర్గందం మధ్యే జీవిస్తున్నారు. ఇంటి నిండా కుప్పులు తెప్పలుగా టిఫిన్ పొట్లాలు ఉన్నాయి. స్థానికులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. వారు సాహసించడం లేదు. తాము ఇంట్లోనే ఉంటామంటూ స్థానికులతో వాగ్వాదానికి దిగుతున్నారు. శనివారం వైద్య సిబ్బందితో కలిసి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని స్థానికులు చెబుతున్నారు. కాగా 2016లో వీరి తండ్రి, 2017లో తల్లి చనిపోయారు. అమ్మానాన్నల మరణంతో మానసికంగా డిస్టబ్ అయి.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారని.. చుట్టుపక్కల వారు చెబుతున్నారు.

తిరుపాల్ నెలలో ఒకసారి బయటకు వెళ్లి.. పేరెంట్స్ బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీ తీసుకుంటాడు. ఆ డబ్బునే నెలంతా వినియోగిస్తారు. రోజులో ఒక అరగంట మాత్రమే బయటకు వచ్చి.. ఇంట్లో వాళ్లకు అన్న పానియాలు తీసుకెళ్తాడు తిరుపాల్. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమింటంటే.. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. 2 ఏళ్ల క్రితమే ఆ ఇంటికి పవర్ సప్లై నిలిపివేశారు.  గత శుక్రవారం స్థానికులు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. ఇళ్లంతా దుర్గందంతో నిండిపోయింది. ఇంట్లోని ముగ్గురు మాసిన బట్టలతోనే ఉన్నారు. అధికారల సాయంతో వారిని జన బాహుల్యానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..