Andhra Pradesh: మూడు రాజధానుల రగడ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా మూడు రాజధానులు నిర్మించి తీరుతామంటున్న వైసీపీ.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే..

Andhra Pradesh: మూడు రాజధానుల రగడ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
Supreme court
Follow us

|

Updated on: Sep 17, 2022 | 1:10 PM

AP News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా మూడు రాజధానులు నిర్మించి తీరుతామంటున్న వైసీపీ.. మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పిటిషన్ లో పేర్కొంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్ లో వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో యాడ్ చేశారు. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

కాగా.. రాజధాని విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గతంలో కీలక తీర్పు వెల్లడించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం అమరావతి రాజధాని నగరం, రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. రాజధాని కోసం భూములిచ్చిన యజమానులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని తెలిపింది. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని ఆదేశించింది. రాజధాని భూములను నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప.. తాకట్టు పెట్టడానికి హక్కులు కల్పించొద్దని స్పష్టం చేసింది.

అయితే.. వచ్చే సంవత్సరం నుంచే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపడం సంచలనంగా మారింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం రాజధాని అంశంపై మాత్రమే చర్చ జరగుతుండటం, పరిస్థితులు వేగంగా మారిపోవడం వంటివి జరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో విశాఖపట్నం ప్రధాన నగరమన్న అమర్నాథ్.. దేశంలోని టాప్ టెన్ నగరాల జాబితాలో విశాఖ ఉందన్నారు. 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం జగన్ అభిప్రాయాన్ని చెప్పారని, విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..