Pawan Kalyan: వైఫల్యాలను ఎత్తి చూపితే కొడతారా.. పెడనలో అరాచకాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలన్న జనసేనాని

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నవారిని బెదిరిస్తూ, దాడులు చేస్తూ ఉంటే..  న్యాయం కోసం తాము పెడనకు రావాల్సి ఉంటుందని చెప్పారు. బాధితులకు న్యాయం కోసం పెడనలో స్వయంగా వచ్చి పోరాటం చేస్తానని హెచ్చరించారు.

Pawan Kalyan: వైఫల్యాలను ఎత్తి చూపితే కొడతారా.. పెడనలో అరాచకాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలన్న జనసేనాని
Pawan Kalyan Pedana
Follow us

|

Updated on: Nov 28, 2022 | 4:05 PM

ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను వైసీపీ నేతలు అణచి వేస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్ పోస్టర్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను.. ఎత్తి చూపినందుకు ముగ్గురు యువకులపై దాడి చేశారన్నారు. తమకు రక్షణ ఇవ్వమని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులకు రక్షణ లేకుండా సాక్షాత్తు పోలీసుల ఎదురుగా పోలీస్ స్టేషన్లోనే వారిని విచక్షణారహితంగా కొట్టరని.. ఈ చర్యలతోనే ఏపీలో పాలన ఏ విధంగా ఉందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు జనసేనాని. కొట్టిన వారంతా స్థానిక ప్రజాపతినిధుల అనుచరులే అని పేర్కొన్నారు. బాధితులు అందరూ తమ తమ కుటుంబాలతో కలిసి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో తమ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిషారు. తమను తమ కుటుంబ సభ్యులను అధికార బలంతో ఎలా కొందరు స్థానిక కార్యకర్తలు ఎలా వేధిస్తున్నారో వివరించారు. ఎవరో ఎక్కడో వైసీపీ నాయకుని కటౌట్ కు నిప్పు పెడితే కూడా ఆ నేరం తమ మీద మోపి.. అక్రమ కేసులు బనాయించి వేధిస్తునంరంటూ వాపోయారు బాధితులు.  ఇంటికి సైతం వచ్చి తమ ఇంట్లోని మహిళలను బేధిస్తున్నారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నవారిని బెదిరిస్తూ, దాడులు చేస్తూ ఉంటే..  న్యాయం కోసం తాము పెడనకు రావాల్సి ఉంటుందని చెప్పారు. బాధితులకు న్యాయం కోసం పెడనలో స్వయంగా వచ్చి పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలనీ కోరారు పవన్ కళ్యాణ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..