Jagananna Vidya Deevena: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ తొలివిడత సాయం.. తల్లుల ఖాతాల్లో జమ కానున్న నగదు..

Jagananna Vidya Deevena scheme: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం

Jagananna Vidya Deevena: నేడు ‘జగనన్న విద్యాదీవెన’ తొలివిడత సాయం.. తల్లుల ఖాతాల్లో జమ కానున్న నగదు..
YS Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2021 | 7:43 AM

Jagananna Vidya Deevena scheme: పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అందించనుంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద ఏటా నాలుగు విడతలుగా అందించనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వ అధికారులు ఇప్పటికే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలను సేకరించారు. బోధనా రుసుముల్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తే ఫీజులు చెల్లించేందుకు ఏటా నాలుగు సార్లు కళాశాలకు వెళ్తారని, అక్కడ సదుపాయాలు, బోధనా పద్ధతుల్ని పరిశీలించి యాజమాన్యాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో.. ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం తొలివిడత, జులైలో రెండో విడత, డిసెంబరులో మూడు, ఫిబ్రవరి 2022లో నాలుగో విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయనున్నారు.

పది లక్షల మందికి పైగా విద్యార్థులకు .. జగనన్న విద్యా దీవెన పథకం కింద పది లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేయనుంది. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు నిధులను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి. బీసీ సంక్షేమశాఖ రూ.491.42 కోట్లు, సాంఘిక సంక్షేమశాఖ రూ.119.25 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ రూ.19.10 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖ రూ.41.68 కోట్ల విడుదల కోసం ఆదివారం ఆమోదం తెలిపాయి. విద్యాదీవెన విడుదల సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.

ఇదిలాఉంటే.. 28న జగనన్న వసతిదీవెన తొలివిడత సాయం కూడా అందించనున్నారు. డిసెంబరులో రెండో విడత విడుదల చేస్తామని సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించింది. వసతిదీవెన ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదివే వారికి రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం ప్రభుత్వం అందించనుంది.

Also Read:

ఏజెన్సీలో గుప్పుమంటున్న మత్తు మందు.. కిలాడీ లేడీ అరెస్ట్‌తో గుట్టురట్టు.. వెయ్యికిలోల గంజాయి స్వాధీనం..!