Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి

Austin Shooting In US: అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ తారా స్థాయికి చేరింది. ఇటీవల అగ్రరాజ్యంలో తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనలతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ గన్ కల్చర్ అగ్రరాజ్యాన్ని

Texas Shooting: అమెరికాలో తీవ్రస్థాయికి చేరిన గన్ కల్చర్.. దుండగుడి కాల్పుల్లో మరో ముగ్గురు మృతి
Texas Shooting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2021 | 6:46 AM

Austin Shooting In US: అమెరికాలో మళ్లీ గన్ కల్చర్ తారా స్థాయికి చేరింది. ఇటీవల అగ్రరాజ్యంలో తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనలతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ గన్ కల్చర్ అగ్రరాజ్యాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. గురువారం రాత్రి ఇండియానాపోలిస్‌ పరిధిలోని ఫెడెక్స్‌ ఫెసిలిటీ ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 8 మంది మరణించారు. ఈ ఘటన మరిచిపోక ముందే అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా సమయం ప్రకారం.. ఆదివారం ఉదయం ఓ షాపింగ్‌ మాల్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ వద్ద చోటుచేసుకుంది. అయితే కాల్పులు జరిపిన దుండగుడు.. అనంతరం తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి కోసం గాలిస్తున్నామని.. సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా కాల్పులు జరిగిన ప్రాంతంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావద్దని పోలీసులు సూచించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలాఉంటే.. గురువారం అమెరికాలోని ఇండియానాపోలిస్‌లోని పరిధిలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన ఎనిమిది మందిలో భారత సంతతికి చెందిన నలుగురు సిక్కులు ఉన్నారు. క్షతగాత్రుల్లో భారత సంతతికి చెందిన ఓ యువతి కూడా ఉంది. కాగా.. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఫెడెక్స్‌లో మాజీ ఉద్యోగి బ్రెండన్ హోలే (19) గా గుర్తించారు. పోలీస్ ఐడీతో ఆ ప్రాంతంలోకి వెళ్లిన దుండగుడు కాల్పులు జరిపి.. ఆ తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెడెక్స్ డెలివరీ సర్వీస్ ఫెసిలిటీలో 90 శాతం మంది కార్మికులు భారతీయ-అమెరికన్లు పనిచేస్తున్నారు. ఎక్కువగా సిక్కు వర్గానికి చెందినవారున్నారు.

Also Read:

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి