జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
నేటితో ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి సంక్షేమ పధకాల ద్వారా...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయింది. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించిన.. మొత్తం 14 నెలల పాటు ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు మేర నడిచారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు.
Also Read: ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!
ఇదిలా ఉంటే ప్రజాసంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందలేనివారికి, తాజాగా దరఖాస్తు చేసుకున్నవారికి శుక్రవారం నుంచి వరుసగా 10 రోజుల పాటు రోజుకో పధకం కింద సహాయం అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా, వైఎస్ఆర్ పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు పేరిట పది రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: ఆ సమయంలోనే బాణాసంచా కాల్చేందుకు అనుమతిః హైదరాబాద్ సీపీ