రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తింటే.. ఎన్నెన్ని లాభాలో!

15 February 2026

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మేలు చేసే గింజ‌ల్లో గుమ్మడి గింజ‌లు చాలా ముఖ్యమైనవి. చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

TV9 Telugu

దీనితోపాటు ఆరోగ్యక‌ర‌మైన కొవ్వులు, ఫైబ‌ర్, మెగ్నీషియం, జింక్, ఫాస్పర‌స్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వీటిని ప‌చ్చిగా, వేయించి, స్మూతీ, స‌లాడ్ ఎలా తీసుకున్నా మంచిదే

TV9 Telugu

గుమ్మడి గింజ‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటిలో మంచి కొలెస్ట్రాల్ ను, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ఈ గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల లిపిడ్ ఫ్రొఫైల్స్ పై సానుకూల ప్రభావం చూపుతాయి

TV9 Telugu

అలాగే గుమ్మడి గింజ‌లను భోజ‌నంలో తీసుకోవ‌డం వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారిలో గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుప‌డుతుంద‌ని పలు అధ్యయ‌నాల ద్వారా నిరూపించాయి

TV9 Telugu

వీటిలో ఉండే ఫైబ‌ర్, ప్రోటీన్ జీర్ణక్రియ‌ను నెమ్మదింప‌జేయ‌డంతో పాటు గ్లూకోజ్ శోష‌ణ‌ను నెమ్మదిస్తుంది. భోజ‌నం త‌రువాత ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి

TV9 Telugu

అంతేకాకుండా గుమ్మడి గింజ‌ల్లో ఉండే బ‌యోయాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుతుంది

TV9 Telugu

గుమ్మడి గింజ‌ల్లోని మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ ప్రశాంత‌మైన నిద్రను ప్రోత్సహిస్తాయి. గుమ్మడి గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల నిద్ర నాణ్యత, వ్యవధి కూడా పెరుగుతుంది. నిద్రలేమి స‌మ‌స్యతో బాధ‌ప‌డే వారు రోజూ గుప్పెడు గుమ్మడి గింజ‌లు తీసుకోవ‌డం వ‌ల్ల హాయిగా నిద్ర పడుతుంది

TV9 Telugu

గుమ్మడి గింజ‌ల్లో జింక్ స‌మృద్ధిగా ఉంటుంది. శ‌రీరంలో హార్మోన్ల ఉత్పత్తికి, నియంత్రణ‌ల‌కు జింక్ చాలా అవ‌స‌రం. పురుషుల్లో టెస్టోస్టిరాన్ సంశ్లేష‌ణ, మ‌హిళ‌ల్లో మొత్తం హార్మోన్ల స‌మ‌తుల్యత‌లో, పునురుత్పత్తి ఆరోగ్యంలో జింక్ కీల‌క పాత్ర పోషిస్తుంది