నారింజ పండ్లు త్వరగా పాడైపోతున్నాయా? ఇలా నిల్వ చేస్తే నెల రోజులు ఫ్రెష్‌

15 February 2026

TV9 Telugu

TV9 Telugu

శీతాకాలంలో పుష్కలంగా లభించే నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విట‌మిన్ సితో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

త‌క్కువ ధ‌ర‌లోనే ల‌భిస్తాయి కూడా. అందుకే చాలా మంది వీటిని ఎక్కువ మొత్తంలో వారానికి స‌రిప‌డా కొనుగోలు చేసి నిల్వ చేస్తూ ఉంటారు. అయితే నారింజ పండ్లను నిల్వ చేయ‌డం చేయడం తెలియక చాలా మంది వీటిని బ‌య‌టే ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు

TV9 Telugu

దీంతో అవి త్వరగా చెడిపోతుంటాయి. వీటిలో ఎలా నిల్వ చేయాలంటే.. ఫ్రిజ్ లో ఉంచవ‌చ్చు. ఫ్రిజ్ లో ఉంచ‌డం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్ లో ఉండే త‌క్కువ ఉష్ణోగ్రత‌లు నారింజ పండ్లు పాడ‌వ్వడాన్ని నెమ్మదిస్తాయి

TV9 Telugu

ఫ్రిజ్ లో ఉంచ‌డం వ‌ల్ల నారింజ పండ్లు తాజాగా, జ్యూసీగా ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేసే ముందు నీటితో క‌డ‌గ‌కూడ‌దు. నీటితో క‌డ‌గ‌డం వ‌ల్ల వాటిపై ఉండే తేమ కార‌ణంగా బూజు ప‌ట్టే అవ‌కాశం ఉంది

TV9 Telugu

కానీ నారింజ పండ్లను తినే ముందే క‌డుక్కోవ‌డం మంచిది. అలాగే వీటిని ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయ‌కూడ‌దు. మెష్, కాట‌న్ బ్యాగ్ లేదా రంధ్రాలు ఉన్న బ్యాగుల్లో నిల్వ చేసుకోవాలి

TV9 Telugu

అదే విధంగా వీటిని ఘాటైన వాస‌న‌లు వ‌చ్చే ఆహార ప‌దార్థాలకు దూరంగా ఉంచాలి. వీటిని ఫ్రిజ్ లో ప్రత్యేక కంటైన‌ర్ లో ఉంచి నిల్వ చేసి అప్పుడ‌ప్పుడు త‌నిఖీ చేస్తూ ఉండాలి

TV9 Telugu

మెత్తగా, బూజు ప‌ట్టిన‌ట్టు క‌నిపించిన పండ్లను వేరు చేయాలి. పాడైన పండ్ల వ‌ల్ల ఇత‌ర పండ్లు పాడ‌య్యే అవ‌కాశం ఉంది. అలాగే నారింజ పండ్లను నిల్వ చేసే ముందు కంటైన‌ర్ లో అడుగున కాగితం ట‌వ‌ల్ ను ఉంచాలి

TV9 Telugu

ఇలా చేయ‌డం వ‌ల్ల అద‌నంగా ఉండే తేమ తొలగిపోతుంది. ఇంట్లో ఫ్రిజ్ లేక‌పోతే గ‌ది ఉష్ణోగ్రత వ‌ద్ద నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేయ‌డం వ‌ల్ల ఒక వారంపాటు పాడ‌వ‌కుండా ఉంటాయి. అర‌టి పండ్లు, ఆపిల్స్ వంటి ఇతర పండ్లతో వీటిని క‌లిపి నిల్వ చేసుకోకూడ‌దు. దీంతో నారింజ పండ్లు త్వర‌గా పాడైపోయే అవ‌కాశం ఉంది