ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!

ఏపీలో ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది.

ఏపీ: 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా.!
Follow us

|

Updated on: Nov 05, 2020 | 6:11 PM

Corona Andhra Pradesh: ఏపీలో ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 829 మంది టీచర్లకు.. 575 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. నవంబర్ 2 నుంచి 9,10 తరగతుల విద్యార్ధులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 70,790 మంది ఉపాధ్యాయులకు.. 95,763 విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పైవిధంగా గణాంకాలు నమోదయ్యాయి.

పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య కంటే కరోనా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య తక్కువగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నామని.. విద్యార్ధులు స్కూల్స్‌కు హాజరు కావడం వల్లే కరోనా సోకినదనడం సరికాదని తెలిపారు.

Also Read: ఏపీ బాటలో తెలంగాణ.. ఇకపై పాఠశాలల్లో అడ్మిషన్లకు నో ‘టీసీ’.!