AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26 గంటల కౌంట్‌డౌన్‌ మొదలైంది…

షార్ సెంటర్  మరో అద్భుమైన ప్రయోగానికి వేదికగా మారుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది. శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు రాకెట్‌ను నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. కరోనా లాక్‌డౌన్ అనంతరం మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే […]

26 గంటల కౌంట్‌డౌన్‌ మొదలైంది...
Sanjay Kasula
|

Updated on: Nov 06, 2020 | 3:37 PM

Share

షార్ సెంటర్  మరో అద్భుమైన ప్రయోగానికి వేదికగా మారుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు ప్రారంభమైంది. కౌంట్‌డౌన్‌ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది.

శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు రాకెట్‌ను నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్‌ఎల్‌వీ సీ-49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

కరోనా లాక్‌డౌన్ అనంతరం మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం విశేషం. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది.

రిశాట్-2 బీఆర్2 శాటిలైట్‌ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్‌) ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్‌ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్‌ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్‌లో జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?
స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా?
పొరపాటున కూడా ఫ్రిజ్‌పై ఈ వస్తువులు ఉంచకండి.. లేదంటే భారీ నష్టం!
పొరపాటున కూడా ఫ్రిజ్‌పై ఈ వస్తువులు ఉంచకండి.. లేదంటే భారీ నష్టం!
శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో..
శీతాకాలంలో ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? ఐతే మీ గుండె ప్రమాదంలో..
నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్
నా సినిమా వాళ్ల సినిమాలా కాదన్నా నిఖిల్
చికెన్‌లో ఈ పార్ట్‌ సైలెంట్‌ కిల్లర్‌.. తిన్నారో నేరుగా కైలాసానిక
చికెన్‌లో ఈ పార్ట్‌ సైలెంట్‌ కిల్లర్‌.. తిన్నారో నేరుగా కైలాసానిక
ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు
ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో ఎగిపడుతున్న మంటలు
డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
డకౌట్‌తో చెత్త ఖాతాలో చేరిన అభిషేక్ శర్మ.. శాంసన్ రికార్డ్‌నే..
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
చల్లని నీళ్లా..? గోరువెచ్చని నీళ్లా..? ఉదయాన్నే ఏవి తాగితే మంచిది
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి
హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి