ఆ సమయంలోనే బాణాసంచా కాల్చండిః హైదరాబాద్ సీపీ

దీపావళి సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. జంట నగరాల్లో భారీ శబ్దాలు చేసే బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు..

ఆ సమయంలోనే బాణాసంచా కాల్చండిః హైదరాబాద్ సీపీ
Follow us

|

Updated on: Nov 05, 2020 | 5:12 PM

Diwali Crackers: దీపావళి సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పలు నిబంధనలు విధించారు. జంట నగరాల్లో భారీ శబ్దాలు చేసే బాణాసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు ప్రజలు ఆరోగ్యాన్ని, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. అలాగే దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతిస్తామన్నారు. కాగా, మెయిన్ రోడ్లు, పబ్లిక్ ప్లేస్‌ల్లో బాణాసంచా, టపాకాయలు కాల్చడానికి అనుమతులు లేవని.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: మానవ తప్పిదమే కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..