ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?

ఏపీలో మిగిలిన జిల్లాలో ఓ లెక్క.. ఆ జిల్లా మరో లెక్క.. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్.. ఆతర్వాత వైసిపి.. అలాంటి జిల్లాలో తొలిసారి స్వీప్ చేసింది టిడిపి. అయితే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ లెక్క మారలేదట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. ఆ సందర్భంలో మంత్రివర్గంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి.

ఈ జిల్లా మంత్రిపదవుల విషయంలో టీడీపీ వైసీపీని ఫాలో అవుతోందా..?
Ycp and Tdp
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 15, 2024 | 9:13 AM

ఏపీలో మిగిలిన జిల్లాలో ఓ లెక్క.. ఆ జిల్లా మరో లెక్క.. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్.. ఆతర్వాత వైసిపి.. అలాంటి జిల్లాలో తొలిసారి స్వీప్ చేసింది టిడిపి. అయితే ఆ జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ లెక్క మారలేదట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ క్లిన్ స్వీప్ చేసింది. ఆ సందర్భంలో మంత్రివర్గంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఆ దక్కిన రెండు మంత్రి పదవులు అవే స్థానాలు కావడం విశేషం. గతంలో నెల్లూరు సిటి నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నుంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఈ ఇద్దరికి తొలివిడత మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అవే నియోజకవర్గాలనుంచి గెలుపొందిన నెల్లూరు సిటి నుంచి పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుంచి విజయం సాధించిన ఆనం రామనారాయణ రెడ్డిలకు తొలివిడత జాబితాలో మంత్రి పదవులు దక్కాయి.

ఇది యాదృచ్చికంగా జరిగాయా.. సమీకరణాల్లో వచ్చాయా అన్నది అలా ఉంచితే వరుసగా రెండు పర్యాయాలు ఆ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కావడం ఆసక్తికరంగా మారింది. కానీ మా సంగతి ఏంటి అంటున్నారు.. క్యాబినెట్‎లో బెర్తుల కోసం ఆశించిన కొందరు ఎమ్మెల్యేలు. అందులో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ ఉన్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 18 నెలల ముందే అధికారాన్ని వదులుకుని వైసీపీకి రెబల్‎గా మారి టీడీపీలో చేరారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర రాష్ట్రంలోనే సూపర్ సక్సెస్ చేసి చూపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి యాత్ర విజయవంతంకోసం కృషి చేశారు. నారా లోకేష్ కూడా ఆ సందర్భంగా నెల్లూరు రూరల్‎లో కోటంరెడ్డి బ్రదర్స్ ఎఫర్ట్‎ను ప్రత్యేకంగా చెప్పారు. దీంతో కోటంరెడ్డికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం గట్టిగా నమ్మకం పెట్టుకుంది. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్న సీనియర్ నేత. వరుసగా ఓటమి చెందిన సోమిరెడ్డి ఈ సారి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి మంత్రివర్గంలో తన పేరు పక్కా అనుకున్నారు. కానీ నిరాశ మిగిలింది. రెండున్నరేళ్ళ తర్వాత అయినా మార్పులు చేర్పుల్లో అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్