Kommu Konam Fish: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. దీని నైజం తెలిస్తే బిత్తరపోతారు

అపాయం అని తలచినప్పుడు కొమ్మతో తోటి చేపలపైనా, మనుషులపైనా కూడా ఇది దాడి చేస్తుంది. ఇది ఎక్స్‌పోర్టు కూడా ఎక్కువగా అవుతుంది. పెద్ద మొత్తంలో ఈ చేప చిక్కితే మత్స్యకారులు ఎక్స్‌పోర్టు చేసే వారికి వీటిని అమ్మేస్తారు. ఈ చేపకు డిమాండ్ ఎంత ఉందో ఈ చేపతో ప్రమాదం అంతే ఉంది.

Kommu Konam Fish: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప.. దీని నైజం తెలిస్తే బిత్తరపోతారు
Kommu Konam Fish
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 26, 2024 | 9:52 AM

తీరం నుంచి లోపలకు వెళ్తే కానీ దొరకని కొమ్ముకోనాం చేప మత్స్యకారుల పాలిట ప్రమాదకరంగా మారుతోంది. పేరులోనే కొమ్మును పెట్టుకున్న ఆ చేప దొరకడం ఎంతో అదృష్టం అని మత్స్యకారులు భావిస్తారో.. తేడా వస్తే అంతే.. దురదృష్టం అన్నది కూడా వారి ఆందోళన. భారీగా సైజుల్లో ఉండే ఈ కొమ్ముకోనాం చేపలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది, మంచి ధర కూడా పలుకుతుంది. అందుకే ప్రమాదం అని తెలిసినా సముద్రం లోనికి వెళ్లి మరీ ఈ చేపను పడుతుంటారు.

రక్షించుకోవడానికి కొమ్మే ఆయుధం….

సముద్ర తీరం నుంచి చాలా దూరంగా వెళ్తే తప్ప చిక్కని ఈ చేపలు గేలాలకు మాత్రమే పడతాయి. ఈ కొమ్ము కోనం చేపలను పట్టుకోవడం కూడా అంత సులభం కాదు. చాలా కష్టం. వీటి ముందుభాగంలో ఇనుప చువ్వలాంటి కొమ్ము ఉంటుంది. చేప సైజ్ ఎంత ఉంటుందో దాదాపుగా అంటే ఈ కొమ్ము కూడా ఉంటుంది. ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తే వాళ్లపై దారుణంగా దాడి చేస్తాయి ఈ చేపలు. అలా వీటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి మరణాలు తీర ప్రాంతంలో ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 250 కేజీల వరకు కూడా ఉంటాయి. పైగా గ్రూపులుగా తిరుగుతుంటాయి. తీరం నుంచి సుమారు ఆరేడు నాటికన్ మైళ్లు దాటిన తర్వాతే ఇవి చిక్కుతాయి.

విశాఖ తీరం లోతుల్లో విరివిగా ఈ రకం చేప

ఇలాంటి ఇనుప చువ్వ లాంటి ప్రమాదకరమైన కొమ్ము కల ఈ కొమ్ముకోనాం చేపలు విశాఖ తీర జలాల్లో కొద్ది దూరంలోనే దొరుకుతూ ఉంటాయి. ముఖ్యంగా వారాంతాల్లో వీటికి గిరాకీ ఎక్కువ ఉంటుందనీ స్థానిక మత్స్యకారులు సముద్ర లోపల జలాల్లోకి వెళ్లి రిస్క్ చేసి మరీ పట్టుకొస్తుంటారు. ఇలా ఆదివారం ఈ రకం చేపలు భారీగానే స్థానిక మత్స్యకారులకు చిక్కాయి. ఈ చేప ధర కేజీ 400 రూపాయలు. ఒక్కో చేప కనీసం 5 కేజీలైనా ఉంటుంది. ఇలాంటి చేప ఒక్కటి దొరికితే 2 వేలు, అందుకే వీటికోసం ప్రమాదం అయినా లోపలకు వెళ్లి వాటి కొమ్ములకు చిక్కకుండా ఉంటూ పట్టి తెచ్చి అమ్ముతూ ఉంటాం అంటున్నారు స్థానిక మత్స్యకారుడు నూకరాజు. టీవీ9 తో మాట్లాడుతూ వీటిని వ్యాపారులు కూడా ఎక్కువ ఆసక్తి తో కొనుగోలు చేస్తారని, కొందరైతే ఈ రకం చేపలకోసం అడ్వాన్స్ కూడా ఇస్తారని అంటున్నారు నూకరాజు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…