Chandragiri: అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహణ.. ఎద్దు కుమ్మడంతో వ్యక్తి మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి జల్లికట్టు పోటీల్లో విషాదం నెలకొంది. ఎద్దు బలంగా ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందడంపై కేసు నమోదు చేశారు పోలీసులు. గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఇక.. కనీస ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోకుండా జల్లికట్టు నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా జరిగిన జల్లికట్టు నిర్వహించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ ఈవెంట్ ఉమ్మడి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కొనసాగుతుంది. అయితే.. చిత్తూరులో పశువుల పండగ పేరుతో సెలవు దినాల్లో ఎప్పుడుపడితే అప్పుడు నిర్వహిస్తారు. తాజాగా.. తిరుపతి జిల్లాలో నిర్వహించిన పశువుల పండుగ అట్టహాసంగా జరిగింది. చంద్రగిరి పట్టణంలోని రంగంపేటలో ఈ ఏడాది తొలిసారి జల్లికట్టు నిర్వహించారు. అయితే.. ఈ జల్లికట్టులో ఎద్దు దాడిలో ఓ వ్యక్తి మృతిచెందడంతో విషాదం నెలకొంది.
చంద్రగిరి పట్టణంలో నిర్వహించిన పశువుల పండుగలో పాల్గొనేందుకు వేలాదిగా యువకులు, ప్రజలు తరలి వచ్చారు. జల్లికట్టు నిర్వహణ లోపంతో పోట్లగిత్తలు జనాలు పైకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో.. నడింపల్లెకు చెందిన వెంకటమునిపై ఎద్దు దాడి చేసింది. ఒక్కసారిగా ఛాతీపై ఎద్దు గట్టిగా ఢీకొట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంకటమునికి స్థానికంగా సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత.. వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరీక్షించిన వైద్యులు అప్పటికే వెంకటముని మృతి చెందినట్లు తెలిపారు.
సరదా కోసం నిర్వహించిన పశువుల పండుగ ఒకరి ప్రాణం బలి తీసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చంద్రగిరి జల్లికట్టులో ఒక వ్యక్తి మృతి చెందడంతోపాటు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఇక.. కనీస ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోకుండా జల్లికట్టు నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా జరిగిన జల్లికట్టు నిర్వహించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జల్లికట్టును తమిళనాడులో సంప్రదాయ క్రీడగా భావిస్తారు. ఎద్దులను బరిలోకి వదిలి.. వాటిని లొంగదీసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే.. పలు సందర్భాల్లో గాయాలు కావడం, ప్రాణాలు కోల్పోతుండడం లాంటివి జరుగుతున్నప్పటికీ.. జల్లికట్టుకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




