YSRCP: సామాజిక బస్సు యాత్రలో ఆసక్తికర పరిణామం.. మనసులోని ఆవేదనను వెల్లగక్కిన డొక్కా మాణిక్య వరప్రసాద్..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. ఒకవైపు సామాజిక సాధికార యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు. మరోవైపు సీఎం జగన్ తన అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు తమకు దక్కుతుందా లేదా అన్న అనుమానం పెనుభూతమై పట్టుకుంది.

YSRCP: సామాజిక బస్సు యాత్రలో ఆసక్తికర పరిణామం.. మనసులోని ఆవేదనను వెల్లగక్కిన డొక్కా మాణిక్య వరప్రసాద్..
Manikya Varaprasad

Updated on: Dec 30, 2023 | 10:25 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. ఒకవైపు సామాజిక సాధికార యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు. మరోవైపు సీఎం జగన్ తన అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు తమకు దక్కుతుందా లేదా అన్న అనుమానం పెనుభూతమై పట్టుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాడికొండలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ను కలిసే అవకాశం తనకు లేకుండా పోయిందని.. వైసీపీ పెద్దలు ఒక్కసారి జగన్‎ను కలిసే అవకాశం కల్పించాలని కోరారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా తాడికొండ బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత అర్థాంతరంగా తొలగించారని వాపోయారు. వైపీపీలో జగన్ మోహన్ రెడ్డి ఏది చెబితే అదే ఫైనల్ అని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాన్ని అందరూ ఆమోదించాల్సిందే అన్నారు.

గతంలో తనకు తాడికొండతో ఎలాంటి సంబంధం లేకున్నా సమన్వయ కర్తగా నియమించి అక్కడి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం కూడా చెప్పినట్లు చెప్పారు. అప్పట్లో అధిష్టానం నుంచి తనకు పిలుపు కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా సర్వేలు బాగోలేదని నన్ను పక్కన పెట్టేశారని తెలిపారు. అడగని సీటుకు సమన్వయకర్తగా నియమించి ఇప్పుడు సుచరితను ఇక్కడ ఇన్‎చార్జిగా నియమించారని చెప్పారు. అయినప్పటికీ మాజీ హోం మంత్రి సుచరిత విజయానికి సహకరిస్తానన్నారు. తనకు రాజకీయాల్లో పోటీ చేయాలన్న ఆశ లేదని.. కానీ జగన్ మోహన్ రెడ్డిని ఒక్కసారి చూడాలన్న కోరిక ఉందని మాణిక్య వరప్రసాద్ అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఈ కోరికను తీర్చేందుకు ఇక్కడ ఉన్న పెద్దలు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..