AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balayya Fan: బాలయ్య రాకుండానే జరిగిన వీరాభిమాని వివాహం.. కానీ అతనొచ్చాడు.. కొంత హ్యాపీ

చింతలగ్రహారం గ్రామంలో ఘనంగా బాలకృష్ణ అభిమాని పెద్ద నాయుడు వివాహం జరిగింది. కానీ బాలయ్య అటెండ్ కాకపోవడంతో.. వధూవరులు కాస్త నొచ్చుకున్నారు.

Balayya Fan: బాలయ్య రాకుండానే జరిగిన వీరాభిమాని వివాహం.. కానీ అతనొచ్చాడు.. కొంత హ్యాపీ
Balayya Fan Marriage
Ram Naramaneni
|

Updated on: Mar 12, 2023 | 2:49 PM

Share

అతడు నందమూరి నటసింహం వీరాభిమాని. గట్టిగా చెప్పాలంటే భక్తుడు. అతడే విశాఖపట్నం పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి చెందిన కోమలీ పెద్దినాయుడు. ఇతడిది ఎంత పిచ్చి అభిమానం అంటే.. బాలయ్య వస్తే గానీ పెళ్లి చేసుకోను అని మొండి పట్టు పట్టేంత. బాలయ్య కోసం.. 1 కాదు.. 2 కాదు ఏకంగా 3 ఏళ్లు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. పెళ్లి కూతురు గౌతమీ ప్రియ  కూడా బాలయ్య ఫ్యాన్ అవ్వడంతో.. బాబు వస్తేనే పెళ్లి చేసుకుంటాం అని కండీషన్ పెట్టారు. ఈ విషయం వైజాగ్ ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ద్వారా.. బాలయ్య అల్లుడు భరత్‌ వద్దకు.. ఆయన ద్వారా బాలయ్య దృష్టికి వెళ్లింది. నటసింహం కూడా వివాహానికి వచ్చేందుకు అంగీకరించారు.

పెళ్లి కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మూడెకరాలు స్థలంతో భారీ సెట్ వేయించారు. బాలయ్య బాబు గారి రేంజ్‌కి ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు చేశారు. దాదాపు 15 రోజుల ముందు నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రయివేటు సెక్యురిటీ కూడా ఏర్పాటు చేశారు. ఊరంతా ప్లెక్సీలు, స్వాగత బోర్డులు,  కటౌట్లు పెట్టారు.  ముహూర్తం మార్చి 11 రాత్రి 2.12 నిమిషాలకు (తెల్లవారితో ఆదివారం). కానీ అనూహ్య రీతిలో బాలయ్య ఆ పెళ్లికి అటెండ్ అవ్వలేకపోయారు. దీంతో నవ దంపతులు నిరాశ చెందారు. అయితే వారిని సముదాయించేందుకు,  ఆశీర్వదించేందుకు బాలయ్య చిన్న అల్లుడు భరత్ వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరైన బాలయ్య అభిమానులు అందరితో ఆయన సెల్ఫీలు దిగారు. త్వరలోనే నాయుడు దంపతులను బాలయ్య బాబు వద్దకు తీసుళ్లడమో లేక బాలయ్యే జిల్లాకు వచ్చినప్పుడు కల్పించడమో చేస్తామని అల్లుడు భరత్ హామీ ఇచ్చారు.

ఇటీవలే బాలయ్య ఇంట్లో ట్రాజెడీ జరిగిన విషయం విధితమే. తారకరత్న గుండెపోటుతో కన్నుమూశారు. అంతేకాక ఆయన మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ పెళ్లికి హాజరుకాలేకపోయారని భరత్ వివరించారు. బాలయ్య బాబు వస్తేనే ఇకపై వివాహం చేసుకుంటామని అభిమానులు ఎవరూ కోరుకోవద్దని ఆయన సూచించారు. ఆయన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని.. అలా ఆయన ప్రతి పెళ్లికి వెళ్లడం వీలు కాదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..