Aghori: మరోసారి వార్తల్లోకి అఘోరీ.. NHRCకి బాధితుడి ఫిర్యాదు
అఘోరీ అంటే..చూస్తే భక్తిభావం కలగాలి..చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. కానీ తెలుగురాష్ట్రాల్లో చక్కర్లు కొట్టిన ఓ అఘోరీ రూటే సెపరేటు. అడ్డుకుంటే..పెట్రోల్ పోసుకుంటానంటుంది. ఆపితే..ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. రోడ్డుపై గంటల తరబడి న్యూసెన్స్ చేసింది. వాస్తవానికి అఘోరీలు..జనంలోకి రారు. పబ్లిసిటీ కోరుకోరు. కానీ ఈమె మాత్రం వింతగా ప్రవర్తించింది. అంతేనా చాలామందిపై దాడికి తెగబడింది.
గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి ఫిర్యాదు చేశారు. మంగళగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పదవీ ప్రమాణ స్వీకారం సందర్భంగా వార్త కవరేజ్‌కి విలేకరులు వెళ్లగా అదే ప్రాంతంలో కార్ వాష్ సెంటర్ వద్ద మారణాయుధాలతో నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న సందర్భంలో పలువురు విలేకరులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయంలో అఘోరీ తన కారులో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని విలేకరితోపాటు కార్ వాష్ సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విలేఖరి కాలు విరిగి తీవ్ర గాయాలపాలవగా స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. కాగా సదరు ఘటనలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి)కు బాధితుడు ఫిర్యాదు చేశారు.
అటు వరంగల్ జిల్లా మామునూరు పీఎస్‌లో నవంబర్ నెలలో అఘోరీపై కేసు నమోదైంది. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో.. కరీంనగర్‌కు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో అఘోరిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 325 BNS,11(A) PCCA యాక్టు కింద కేసు ఫైల్ చేశారు.
అఘోరాలైనా..అఘోరీలైనా..ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ..ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్ క్రియెట్ చేసింది. నడిరోడ్డుపై ఈ అఘోరీ చేష్టలు..ఇటు జనానికి, అటు పోలీసులను చికాకు తెప్పించాయి. రెండు నెలల పాటు ఇరు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన ఈ అఘోరీ ఇప్పుడు కనుమరుగైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..