AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. మూడు సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందం..

ఏపీ ఐటీ రంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఓయూలను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి.

అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్.. మూడు సంస్థలతో చంద్రబాబు సర్కార్ ఒప్పందం..
Quantum Valley Park
Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2025 | 9:50 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కు ఏర్పాటుకు చేసుకున్న ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ ఐటీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్కును అగ్రశ్రేణి ఐటీ సంస్థలు టీసీఎస్, ఎల్ అండ్ టీ , ఐబీఎం నిర్మాణం చేపట్టనున్నాయి. క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ఈ మూడు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. క్వాంటం కంప్యూటింగ్ పార్కులో అధునాతన 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2 ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. 2026 జనవరి 1 నాటికి అమరావతి రాజధానిలో అధునాతన క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. క్యాంటం కంప్యూటింగ్ సర్వీసెస్ , సొల్యూషన్స్ తో పాటు పరిశోధన, హైబ్రీడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్‌ను టీసీఎస్ అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్ధిక, ఉత్పత్తి, విద్యా రంగాలకు చెందిన వివిధ అప్లికేషన్లు, పరిశోధన సహకారాన్ని అందించేలా ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

క్లైంట్ నెట్వర్క్‌తో పాటు స్టార్టప్ , ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, ఇంజనీరింగ్ నైపుణ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ అందించనుంది. క్వాంటం వ్యాలీ పార్క్‌తో అమరావతిలో వేలాదిమందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. దీనితో పాటు విశాఖపట్నంకు కూడా పలు ఐటీ సంస్థలు రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌తో అమరావతిలో అత్యాధునిక సాంకేతికత కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.

మరోవైపు, కూటమి ప్రభుత్వంలో ఏపీలో అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టిన చంద్రబాబు సర్కార్‌. దేశంలోనే అద్భుతమైన రాజధాని నెలకొల్పేలా చర్యలు చేపడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..