మహానందిలో నాగుపాము హల్‌చల్..! ఓ ఇంట్లోకి చొరబడి ముప్పతిప్పలు పెట్టింది..
శనివారం రాత్రి నాగుపాము గుర్తించిన స్థానికుకులు పట్టుకోడానికి ప్రయత్నించగా బసవరాజు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. ఇంటి పై కప్పు రేకుల కింద సందులో దూరిన నాగుపాము.. పడగ విప్పి అక్కడే ఉండిపోయింది. ఇంట్లోవారు భయంతో వణికిపోయారు. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది అయ్యన్న నగర్ లో నాగుపాము హల్ చల్ చేసింది. గత రెండు రోజులిగా కాలనిలోలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూంది.ఈ క్రమంలో శనివారం రాత్రి నాగుపాము గుర్తించిన స్థానికుకులు పట్టుకోడానికి ప్రయత్నించగా బసవరాజు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడింది. ఇంటి పై కప్పు రేకుల కింద సందులో దూరిన నాగుపాము.. పడగ విప్పి అక్కడే ఉండిపోయింది. ఇంట్లోవారు భయంతో వణికిపోయారు. స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం ఇచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..
సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న స్నెక్ క్యాచర్ మోహన్ దాదాపు రెండుగంటల పాటు శ్రమించి రేకుల కింద నక్కిన నాగుపాము పట్టుకున్నాడు. దానిని ఓ సంచిలో బంధించి సమీపంలోని నల్లమల అడవిలో వదిలేశాడు. గత రెండు రోజులుగా కాలని వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నాగుపాము ఎట్టకేలకు పట్టుబడటంతో కాలని వాసులు ఊపిరి పోల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




