AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime: అడ్డుగా ఉన్నాడని సైనైడ్ తాగించింది.. ఆత్మహత్యగా చిత్రీకరించేలా నాటకమాడింది.. చివరికి

వివాహేతర సంబంధాలు చివరికి తీవ్ర విషాదాలుగా మారుతున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వీటి విషయంలో కొందరు మహిళలు ఎందాకైనా తెగిస్తుండటం, చివరికి కన్నపిల్లల్ని, కట్టుకున్నవాడినీ హత్య చేయడం సాధారణంగా మారింది. అక్క....

AP Crime: అడ్డుగా ఉన్నాడని సైనైడ్ తాగించింది.. ఆత్మహత్యగా చిత్రీకరించేలా నాటకమాడింది.. చివరికి
Chittoor man Arrested
Ganesh Mudavath
|

Updated on: Apr 22, 2022 | 8:58 AM

Share

వివాహేతర సంబంధాలు చివరికి తీవ్ర విషాదాలుగా మారుతున్న ఘటనలు ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వీటి విషయంలో కొందరు మహిళలు ఎందాకైనా తెగిస్తుండటం, చివరికి కన్నపిల్లల్ని, కట్టుకున్నవాడినీ హత్య చేయడం సాధారణంగా మారింది. అక్క భర్తతో వివాహేతర సంబంధం.. సొంత భర్తను హత్య(Murder) చేసేందుకు దారి తీసింది. పవిత్రమైన పెళ్లి బంధాన్ని అపహాస్యం చేస్తూ ఓ మహిళ కట్టుకున్న వాడినే కడతేర్చింది. హత్యను ఆత్మహత్యగా(Suicide) చిత్రీకరించేందుకు ప్రయత్నించినా ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.కారుతో దొరికిన కాలి చెప్పు.. నిందితులను అడ్డంగా పట్టించింది. చివరికి కటకటాల వెనక్కు నెట్టింది. గుంటూరు(Guntur) జిల్లా ఫిరంగిపురం మండలంలోని పొనుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర.. తన సమీప బంధువైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. వీరికి సంతానం లేదు. అయితే పెళ్లికి ముందు నుంచే మహిళకు తన సోదరి భర్తతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం పెళ్లయ్యాక భర్తకు తెలిసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళ నరేంద్రను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. నరసరావుపేటలో నివసించే సోదరి ఇంట్లో హత్యకు ప్రణాళికలు రచించింది.

గతంలో పరిచయం ఉన్న బాలరాజు, చౌడయ్యతో హత్య ఎలా చేయాలా అనే విషయంపై బార్ లో చర్చలు జరిపారు. అప్పు వసూలుకు తాము మార్కాపురం వెళ్తున్నట్లు చెప్పి నరేంద్రనూ రావాలని కోరారు. అతణ్ని కారులో ఎక్కించుకుని బయలుదేరారు. మార్గ మధ్యలో ఆగి మద్యం సేవించారు. ముందస్తు ప్లాన్ ప్రకారం మద్యంలో సైనైడ్ కలిపి నరేంద్రతో తాగించారు. అతను విలవిల్లాడుతూ కారులోనే మృతి చెందాడు. మృతదేహాన్ని సాతులూరు వద్ద పెద్దనందిపాడు బ్రాంచి కాలువ కట్టపై పడేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కన పురుగు మందు డబ్బా పెట్టి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న నరేంద్ర కుటుంబసభ్యులు మృతదేహాన్ని పరిశీలించారు. అతని మృతి అనుమానాస్పదంగా ఉండటంతో తండ్రి వీరయ్య నాదెండ్ల పోలీసులకు 2017లో ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ఒకే కాలుకు చెప్పు ఉండటం, మరో చెప్పు కారులో ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. అనుమానంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సాక్ష్యాధారాలతో సహా నిందితులు నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

Also  Read

Corona Victims: కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? దడపుట్టిస్తున్న తాజా రీసెర్చ్‌..!

Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు డేంజర్ వార్నింగ్స్.. ఇంతకీ ఆ ప్రాజెక్టుకు ఏమైంది?

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో