Corona Victims: కరోనా బాధితులకు పిల్లలు పుట్టరా..? దడపుట్టిస్తున్న తాజా రీసెర్చ్..!
కరోనా మిగిల్చిన చేదు అంతా ఇంతా కాదు. ఇపుడు దీని ప్రభావం ఏకంగా వారసత్వంపై దెబ్బతీస్తోంది. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్ ఫలితాలు దడ పుట్టిస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న మగవాళ్లలో సంతానోత్పత్తి తగ్గుతుందని
కరోనా మిగిల్చిన చేదు అంతా ఇంతా కాదు. ఇపుడు దీని ప్రభావం ఏకంగా వారసత్వంపై దెబ్బతీస్తోంది. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్ ఫలితాలు దడ పుట్టిస్తున్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న మగవాళ్లలో సంతానోత్పత్తి తగ్గుతుందని ఐఐటీ బొంబాయి చేసిన అధ్యయనంలో తేలింది. స్వల్ప లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారిలోనూ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రోటీన్లు దెబ్బతింటున్నాయని తెలిసింది. కాగా, ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ఏసీఎస్ ఒమెగా జర్నల్ గతవారం ప్రచురించింది. ఈ అధ్యయనాన్ని ఐఐటీ బొంబాయితో కలిసి జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ అధ్యయనంలో కోవిడ్‌కు కారణమైన సార్స్-2 వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఇతర కణజాలాలను కూడా దెబ్బతీస్తుందని పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనంలో 20 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పది మంది ఆరోగ్యవంతమైన మగవాళ్ల వీర్యంతో పాటు , కోవిడ్ బారి నుంచి కోలుకున్న మగవాళ్ల వీర్య నమూనాలను విశ్లేషించారు. అయితే ఆరోగ్యవంతమైన మగవాళ్లలో కంటే కరోనా సోకిన వారిలో వీర్య కణాలు బాగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. సంతానోత్పత్తికి సంబంధించిన రెండు ప్రోటీన్లు సెమెనోజెలిన్ 1, ప్రోసాపోసిన్ కరోనా నుంచి బయటపడినవారిలో తక్కువ స్థాయిలో ఉన్నట్టు పరిశోధకులు చెప్పారు. కోవిడ్ సార్స్ కోవ్ 2 పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా కూడా ప్రభావం వేస్తుందని పరిశోధనలు తెలియజేశాయి. అయితే పరిశోధనలో వెల్లడైన వీటిని నిర్ధారించడానికి లోతుగా అధ్యయనం జరగాలని పరిశోధకులు అన్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

