AP Weather: ఏపీలో వర్షాలు ఇంకా కొనసాగుతాయా..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏపీలో వరుణుడు ఎంతటి బీభత్సం సృష్టించాడో చూశారుగా.. ఇప్పటికీ పలు ప్రాంతాలు వరదనీటిలోనే ఉన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు ఇంకా కొనసాగతాయా..? వెదర్ రిపోర్ట్ ఇదిగో..
సగటు సముద్ర మట్టం వద్ద ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్ అల్పపీడన కేంద్రం, పశ్చిమ విదర్భ & పరిసర ప్రాంతాలపై నుండి రామగుండం, కళింగపట్నం ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం.గుండా వెళుతుంది. ఉత్తర ద్వీపకల్ప భారతదేశంలో షీర్ జోన్ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి పైన 3.1 కి.మీ వద్ద దాదాపు 20°ఉత్సర అక్షాంశము వద్ద కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉపరితల అవర్తనము కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం & పరిసరాల్లో కొనసాగుతున్నది. 05 సెప్టెంబర్, 2024 తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం పదండి..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఊరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-
————————————–
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఊరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
బుధవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది
గురువారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
రాయలసీమ :-
———————————
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .
బుధవారం, గురువారం;- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..