Andhra Pradesh: అల్లకల్లోలంగా సముద్రం.. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
రాయలసీమలోనూ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కోస్తాలో ఈదురు గాలులు.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇది మరికొద్ది గంటల్లో మరింత బలపడనుంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కేపుపారా తీరానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్ దిగా తీరానికి ఆగ్నేయంగా...
ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఈ తెల్లవారుజామున వాయుగుండం గా మారింది. మరికొద్ది గంటల్లో మరింత బలపడి ఈ సాయంత్రానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండానికి అనుబంధంగా సముద్రమట్టానికి 9.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి గాలులో తెలుగు రాష్ట్రాలపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరకొస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మూస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాయలసీమలోనూ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కోస్తాలో ఈదురు గాలులు.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఇది మరికొద్ది గంటల్లో మరింత బలపడనుంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కేపుపారా తీరానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్ దిగా తీరానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తీవ్ర వాయుగుండం గా మారి ఈశాన్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి బంగ్లాదేశ్ కేపు పార తీరంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ తో పాటు పరిసర తీరప్రాంతాల్లో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరాదని సూచించింది భారత వాతావరణ శాఖ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..