AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP – Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు మళ్లీ భారీ వర్షాల హెచ్చరికలు వచ్చాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌తో పాటు మరో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక ఏలూరు జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉండగా... ఆంధ్రాలోని ఇతర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

AP - Telangana: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన
Weather
Ram Naramaneni
|

Updated on: Jul 26, 2025 | 10:04 PM

Share

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. మళ్లీ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధానంగా.. ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. దాంతో.. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు.. నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక.. ఏపీకి వాయుగుండం ప్రభావం తప్పినప్పటికీ.. పలు జిల్లాల్లో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏలూరు జిల్లాకు ఆరెంజ్‌ అలెర్ట్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే.. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించింది. ముఖ్యంగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు.. కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?