AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ప్రజలకు కూల్ న్యూస్.. మరో మూడు రోజులు ఫుల్లుగా వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Rain Alert: ప్రజలకు కూల్ న్యూస్.. మరో మూడు రోజులు ఫుల్లుగా వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: May 09, 2024 | 8:02 PM

Share

వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అంచనావేసింది. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక వద్ద ఆవర్తనం మీదుగా సముద్ర మట్టానికి సగటున 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

అలాగే శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.

గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కర్నూలు జిల్లా గూడూరులో 31.5మిమీ, కర్నూలు జిల్లా కొక్కరచేడులో 29మిమీ, కాకినాడ జిల్లా కృష్ణవరంలో 27.2మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 26.2మిమీ,బాపట్ల జిల్లా రేపల్లెలో 24.7మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 24.2మిమీ, మన్యం జిల్లా సాలూరులో 23.2మిమీ అధిక వర్షపాతం నమోదైందన్నారు.

రేపు శ్రీకాకుళం బూర్జ, విజయనగరం సంతకవిటి, పార్వతీపురం మన్యం పాలకొండ మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

గురువారం అనంతపురం జిల్లా మాలపురం, నంద్యాల జిల్లా నందవరంలో 39.9°C, కర్నూలు జిల్లా కోసిగిలో 39.8°C, తిరుపతి రూరల్లో 39.5°C, వైయస్ఆర్ జిల్లా బలపనూరులో 39.4°C, సత్యసాయి జిల్లా కనగానపల్లిలో 39.3°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!