AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు.. రోడ్ల పక్కన కొండలను తలపించేలా ఇసుక స్టాక్‌లు!

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు చూసిచూడనట్టు వదిలేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇసుక అక్రమరావాణపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు.. రోడ్ల పక్కన కొండలను తలపించేలా ఇసుక స్టాక్‌లు!
Sand Mining
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jun 13, 2025 | 4:14 PM

Share

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. జిల్లాలో వందల సంఖ్యలో ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో ఓపెన్ ర్యాంపులు, బోట్స్ మెన్ సొసైటీ ర్యాంపులు ఉన్నాయి. కొందరు వ్యాపారులు వీటి నుంచి పెద్దమొత్తంలో ఇసుకను తవ్వతూ అక్రమంగా తరలిస్తున్నారు. ఓపెన్ ర్యాంపుల్లో అయితే అసలు ఎంత ఇసుక తవ్వుతున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారనే దానికి లెక్కా పత్రం లేకుండా పోతోంది. లారీలు, భారీ యంత్రాలు, పైగా డ్రెడ్జర్లను సైతం ఉపయోగించి ఇసుక తవ్వేస్తున్నారు.

ఇటు రాజమండ్రిలోనూ ఎటు చూసినా ఇసుక గుట్టలు పెద్ద ఎత్తున దశమిస్తున్నాయి. నేల నుంచి ఆకాశాన్ని తాకినట్లు పెద్ద మొత్తంలో ఇసుక నిలవలు కనిపిస్తున్నాయి. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నిలువ చేసామని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే ఇసుక స్టాక్‌ల వద్ద 7లక్షల మెట్రిక్ టన్నులకు పైగా స్టాక్‌ను నిల్వ చేస్తే గోదావరిలో ఇసుక తవ్వకాలుగాని డ్రడ్జింగ్ గాని చేయకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ఉంచి. అధికారుల కనుసనల్లోనే పెద్ద మొత్తంలో గోదావరినీ తవేస్తున్నారు కొందరు. స్థానిక బ్రిడ్జ్‌లకు 500 మీటర్ల దూరంగా తవ్వకాలు అనేవి జరగాలి. కానీ బ్రిడ్జిలకు కూత వేట దూరంలోనే రాజమండ్రిలో ఇసుక తవ్వకాలు జోరుగా జరుపుతూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

అయితే, కొందరు వ్యాపారులు ఇలా నిబంధనలకు విరుద్దంగా ఇసుకను అక్రమంగా తవ్వుతూ తరలించడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కనే పెద్ద ఎత్తున ఇసుక నిలవలు చేయడంతో వర్షానికి ఆ ఇసుక రోడ్లపై చేరి పలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో కాతేరు, క్వారీ మార్కెట్, గ్రామం బ్రిడ్జికి సమీపంలో స్టాక్ పాయింట్లు పేరుతో భారీగా ఇసుక నిలవలు చేశారు. అటు ధవలేశ్వరం, ఆలమూరులోనూ పెద్ద ఎత్తున కొండలను తలపించేలా ఇసుక నిలువలు చేశారు. ఇలా ఇసుక నిలువలు చేస్తూ, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా..దీనిపై అధికారులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. పరిమితికి మించిన లోడ్‌లతో లారీలు రోడ్లపై తిరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..