బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

| Edited By: Ravi Kiran

Dec 24, 2024 | 4:18 PM

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. హెల్మెట్లు ఎందుకు పెట్టుకోవట్లేదు.? కఠినమైన ఆంక్షలు ఎందుకని పోలీసులు అమలు చేయటం లేదని.? ప్రశ్నించడంతో రంగంలోకి దిగిన..

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్
Traffic Police
Follow us on

సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై వాహనాదారులలో హెల్మెట్‌పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదేశాలతో ట్రాఫిక్ అండ్ లా & ఆర్డర్ పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో హెల్మెట్ ధరించని వాహనదారులను హెల్మెట్ వలన ఉపయోగాలను గురించి అవగాహన కల్పించడంతో పాటు… పెండింగ్ చలాన్లపై కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉన్న జరిమానాలను వెంటనే చెల్లించాలని, ఫోన్‌లోనే జరిమానాలు చెల్లించే అవకాశం ఉందంటూ తెలియజేస్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తాం అని హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: టిక్.. టాక్.. టిక్..! ఈ ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. హెల్మెట్లు ఎందుకు పెట్టుకోవట్లేదు.? కఠినమైన ఆంక్షలు ఎందుకని పోలీసులు అమలు చేయటం లేదని.? ప్రశ్నించడంతో రంగంలోకి దిగిన విజయవాడ పోలీసులు నగరవ్యాప్తంగా ఇప్పటికే ముమ్మర తనిఖీలు చేయడంతో పాటు ఇష్టానుసారంగా బైక్స్ డ్రైవ్ చేసి హెల్మెట్ లేకుండా నడుపుతున్నవారిని, పెండింగ్ చలాన్లు కట్టకుండా ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ చలానా చెల్లించాల్సిందేనని అంటూ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

సోమవారం ఒక్క రోజే స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధరించని 656 మంది వ్యక్తుల నుంచి రూ 2,58,155 రుసుము కలెక్ట్ చేసి ఒక వాహనం సీజ్ చేశారు. పెండింగ్ చలాన్‌లను https://echallan.parivahan.gov.in/index/accused-challan లింక్ ద్వారా చెల్లించే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలాగే పెండింగ్ చలానాలు ఉన్న అందరికి మెసేజ్‌లను పంపుతున్నారు. ఆ మెసేజ్‌లలో ఉన్న లింక్ ఓపెన్ చేసి కట్టే విధంగా సందేశాన్ని పంపుతున్నారు. అదే విధంగా అన్ని పోలీస్ స్టేషన్స్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వాహనదారులు తమకు విధించిన చలాన్‌లను 90 రోజులలో చెల్లించని యెడల ఇకపై వాహనాలను సీజ్ చేస్తారు.

ఇది చదవండి: ఇదేం లొల్లిరా.. శోభనం రాత్రి వధువు వింత కోరికలు.. దెబ్బకు బిత్తరపోయిన వరుడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..