Chandrababu: 3 రోజులు పాటు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం.. నేడు పెదకూరపాడులో బాబు పర్యటన

| Edited By: Ravi Kiran

Apr 25, 2023 | 3:51 PM

డీపీ అధినేత పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పర్యటనకు సంబంధించి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆ ఫ్లెక్సీలు ఎదురుగానే చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Chandrababu: 3 రోజులు పాటు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం.. నేడు పెదకూరపాడులో బాబు పర్యటన
Chandrababu
Follow us on

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య వార్ ఓ రేంజ్‌లో సాగుతుంటుంది. చంద్రబాబు టూర్‌ నేపథ్యంలో పెదకూరపాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఇటు పార్టీలో విభేదాలు, అటు అధికార పక్షం ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతోందా లేదా అన్న సందిగ్ధత అయితే నెలకొంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంగళవారం నుంచి మూడు రోజులు పాటు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అయితే టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పర్యటనకు సంబంధించి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆ ఫ్లెక్సీలు ఎదురుగానే చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గో బ్యాక్ చంద్రబాబు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆయన పర్యటన అడ్డుకుంటామంటూ పోస్టర్లు వేశారు. ఈ ఫ్లెక్సీలు తొలగించాలంటూ టీడీపీ కార్యకర్తలు అమరావతిలో ఆందోళనకు దిగారు. ఈ పోటాపోటీ ప్లెక్సీలు ఏర్పాటుతో నియోజకవర్గాలలో పరిస్థితులు హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.

చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి, అప్పుడు నియోజకవర్గంలో పర్యటించాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. తనపై ఆరోపణలు చేస్తే తాను తగిన విధంగా సమాధానం చెప్తానన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు చంద్రబాబు పర్యటన సందర్భంగా పార్టీలో విభేదాలు కూడా చర్చగా మారాయి.పెదకూరపాడు టీడీపీ టీడీపీలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమరావతిలో ఫ్లెక్సీల ఏర్పాటులో వట్టికుంట – కొమ్మాలపాటి వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీ నేత వట్టికుంట శేషగిరి రావు పేరుతో చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో వట్టికుంట వర్గీయులు కట్టిన బ్యానర్లను కొమ్మాలపాటి వర్గం చించేసింది. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు పర్యటన సజావుగా సాగుతోందా లేదా అన్న సందిగ్ధత అయితే నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..