Watch Video: వందల సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు.. ప్రారంభమైన చేపల వేట..

| Edited By: Srikar T

Aug 13, 2024 | 3:32 PM

చీమల పుట్ట పగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో.. శ్రీశైలం డ్యాం దిగువన మత్స్యకారులు తరలి వచ్చిన పరిస్థితి అలా ఉంది. ఒక్కసారిగా చేపల వేట కోసం చాలా మంది మత్స్యకారులు తరలివచ్చిన దృశ్యాలు అందరిని కట్టిపడేస్తున్నాయి.

Watch Video: వందల సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులు.. ప్రారంభమైన చేపల వేట..
Nandyala District
Follow us on

చీమల పుట్ట పగిలితే పరిస్థితి ఎలా ఉంటుందో.. శ్రీశైలం డ్యాం దిగువన మత్స్యకారులు తరలి వచ్చిన పరిస్థితి అలా ఉంది. ఒక్కసారిగా చేపల వేట కోసం చాలా మంది మత్స్యకారులు తరలివచ్చిన దృశ్యాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం దిగువన చేపల వేట కోసం వచ్చిన మత్స్యకారులతో సందడి వాతావరణం నెలకొంది. గత నెలలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో జులై 29న శ్రీశైలం జలాశయం 10 రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‎కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈనేపథ్యంలో గత 14 రోజులుగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు అదేశాలు జారీ చేశారు. ఎగువ నుండి వరద ప్రవాహం ఎక్కువగా ఉందని జలాశయం అధికారులు మత్స్యకారులకు తెలిపారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో చేపల వేటను నిషేధించారు. అయితే శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆగస్టు 12న సాయంత్రం రేడియల్ క్రెస్టు గేట్లు మొత్తం జలాశయం అధికారులు మూసివేశారు. ఒక్కసారిగా గేట్లు మూయడంతో మత్స్యకారులు జలాశయం దిగువన చేపల వేటకు వందల పుట్టిలతో చేరుకున్నారు. వీరి రాకతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. గేట్లు మూసి వేసిన ప్రాంతానికి వెళ్లి చేపలు పట్టేందుకు ప్రయత్నించారు. సుమారు 13,14 రోజులుగా జలాశయం గేట్లు తెరిచి ఉంచడంతో మత్స్యకారుల చేపల వేటకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. తాజాగా జలాశయం వద్ద వరద ప్రవాహం తగ్గడంతో గేట్లు మూశారు. దీంతో మత్స్యకారులు ఆనందంతో వందల సంఖ్యల్లో పుట్టిలతో చేపల వలలు తీసుకుని వచ్చారు. ఈ మత్స్యకారుల వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..