AP News: కోడి పందాలా.. మజాకా.! భీమవరంలో రూమ్‌ దొరకాలంటే యుద్ధాలు చేయాల్సిందే

|

Jan 12, 2025 | 1:07 PM

హౌజ్ ఫుల్లు... రూములు నిల్లు. వీఐపీ అయినా... హైలీ రికమండేషన్ ఉన్నా రూమ్‌ దొరకడం కష్టమే. లెక్క ఎక్కువైనా... రూము పక్కా అన్నది చెప్పలేం. యస్‌... భీమవరంలో ఇప్పుడివే డైలాగులు వినిపిస్తున్నాయి. అప్పు అయినా దొరుకుతుందేమో గానీ.. రూము దొరకడం మాత్రం యమా కష్టంగా మారిపోయిందక్కడ.

AP News: కోడి పందాలా.. మజాకా.! భీమవరంలో రూమ్‌ దొరకాలంటే యుద్ధాలు చేయాల్సిందే
Bhimavaram Hotels
Follow us on

తింటే గారెలే తినాలి.. చూస్తే భీమవరంలో కోడి పందాలే చూడాలంటూ భారీ ఎలివేషన్లు ఇస్తుంటారు. అయితే.. ఆ ఎలివేషన్లకి ఏమాత్రం తగ్గకుండా అరేంజ్‌మెంట్స్‌ కూడా నెక్ట్స్‌ లెవల్‌లో చేస్తున్నారు. అదరహో అనేలా.. క్రికెట్‌ స్టేడియాలను తలపించేలా బరులను సిద్ధం చేస్తున్నారు. పందేలొద్దు అంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. సాంప్రదాయాన్ని నిలబెట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇంకేముంది దారులన్నీ భీమవరం వైపే అన్నట్లుగా ఉంది పరిస్థితి.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

నిన్న, మొన్నా కాదు.. నెల రోజుల క్రితమే హోటల్స్‌ ఫుల్ అయిపోయాయి. హోటల్స్‌ బయట హౌజ్‌ ఫుల్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక్క ఆంధ్ర నుంచే కాదు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా కోడి పందేలను చూసేందుకు వస్తుండటంతో హోటల్‌లో రూమ్‌ దొరకడం యమా కష్టంగా మారింది. స్టార్‌ హీరో సినిమా బెనిఫిట్‌ షో టికెట్‌ అయినా దొరుకుతుందేమో గానీ.. సింగిల్‌ రూమ్‌ బుక్‌ చేయడం కోసం యుద్ధాలే చేయాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

వీఐపీ అయినా.. హైలీ రికమండేషన్‌ ఉన్నా.. ఐ డోంట్‌ కేర్‌ అన్నట్లుగానే ఉంది అక్కడి హోటల్‌ యాజమాన్యాల పరిస్థితి. మీరు ఎవరి రిఫరెన్స్‌తో వచ్చినా… సారీ సర్‌ అని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఇక హోటల్‌ లేకపోతేనేం… లాడ్జిల్లోనైనా అడ్జస్ట్‌ అవుదామంటే అక్కడా అదే పరిస్థితి. పోనీ ఏదైనా అపార్ట్‌మెంట్‌లో వన్‌ మంత్‌ రెంట్‌ కట్టి ఉందామన్నా… హైలీ ఇంపాజిబుల్‌ అన్నట్లుగానే ఉంది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్లను కూడా వదిలిపెట్టుకుండా ఈ నాలుగురోజులకి హోటల్‌లా మార్చి మాంచి బిజినెస్‌ చేస్తున్నారు. ఇటు కళ్యాణ మండపాలు కూడా ముందే బుక్‌ అయిపోవడంతో చాలా మంది నిరాశకు గురవవుతున్నారు.

ఇది చదవండి: సాధారణ తనిఖీలు.. అనుమానాస్పదంగా భారీ కంటైనర్లు.. తెరిచి చూడగా

ఈ హోటల్స్‌ కూడా చాలా కాస్ట్‌లీ గురూ. భోగీ, సంక్రాంతి, కనుమ… ఇలా మూడు రోజులకు సింగిల్‌ రూమ్‌కి 30వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు చార్జ్‌ చేస్తున్నారు. రూము దొరకడమే కష్టం.. అదీ సంవత్సరానికి ఒక్కసారే కదా అని ఇటు జనాలు కూడా లెక్క ఎక్కువైనా లెక్క చేయకుండా రూమ్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు.

ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి