మార్కెట్ ధర కంటే తక్కువే.. శ్రీవారి గోల్డ్, సిల్వర్ డాలర్లకు భారీ డిమాండ్
తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది.

తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు డిమాండ్ పెరిగింది. బులియన్ మార్కెట్లో రోజురోజుకు పరుగులు పెడుతున్న బంగారు, వెండి ధరలతో కొండపై డాలర్స్ గిరాకీ నెలకొంది. తిరుమలలో వారానికో రోజు మాత్రమే ధర నిర్ణయిస్తున్న టీటీడీ మార్కెట్లో కంటే తక్కువగా బంగారు ధర ఉండడంతో కొనుగోలుకు డిమాండ్ పెరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండము వద్ద ఉన్న కౌంటర్లో బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. 10,5,2 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్లు, 50,10,5 గ్రాముల వెండి డాలర్లను టిటిడి విక్రయిస్తోంది. ఈ వారం శ్రీవారి బంగారు, వెండి డాలర్ల ధరలను నిర్ణయించిన టిటిడి మార్కెట్లో ఉన్న బంగారు వెండి ధరలకంటే తక్కువగా ధరలు నిర్ణయించింది.
శ్రీవారి డాలర్లకు డిమాండ్ ఎందుకు పెరిగిందంటే..?
10 గ్రాముల 22 క్యారెట్ల శ్రీవారి బంగారు డాలర్ ధర GSTతో కలిపి రూ. 1,55,855 గా నిర్ధారించి విక్రయాలు జకరుపుతోంది. ఇక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ ధర రూ. 78,801, 2 గ్రాముల బంగారు డాలర్ ధర రూ. 32,429 లు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తోంది.
మరోవైపు 50 గ్రాముల శ్రీవారి వెండి ధర రూ. 19,818, 10 గ్రాముల వెండి డాలర్ ధర రూ 4,095, 5 గ్రాముల వెండి డాలర్ ధర రూ 2,127లు నిర్ణయించిన టిటిడి ఈ మేరకు భక్తులకు శ్రీవారి డాలర్లను అందుబాటులో ఉంచింది.
ఇక ఈ రోజు ఉదయం ఆన్ లైన్లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారు ధర రూ. 1,73,40 ఉండటంతో శ్రీవారి డాలర్లకు గిరాకీ పెరిగింది. 10 గ్రాముల బంగారు ధర మార్కెట్లో కంటే దాదాపు రూ. 15 వేలు తక్కువ ధరకే శ్రీవారి డాలర్ దొరుకుతుండడం, మరోవైపు కూలీ, తరుగు జీఎస్టీతో పాటు టీటీడీ అమ్ముతున్న డాలర్లను మరింత తక్కువ ధరకే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కటి మాత్రమే విక్రయిస్తోంది. భక్తుల పేరు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్లను తీసుకుని తక్కువ ధరకే టీటీడీ శ్రీవారి డాలర్ల విక్రయిస్తుండడం పట్ల భక్తుల్లో ఆనందం వ్యక్తమౌతోంది.
అయితే టీటీడీకి మాత్రం బంగారు వెండి ధరలు దోబూచులాడుతుండడం, ధరల తేడాతో డాలర్ల అమ్మకాలతో టీటీడీ లాభం పొందలేక పోతోంది.
