AP Rains: ఏపీలో వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్
కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 7 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేదు. వచ్చే 3 రోజుల్లో వాతావరణ శాఖ ఇలా ఉండనుంది. ఆ వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా

అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ & నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి రేపు, 13 మే, 2025 నాటికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ & నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు తదుపరి 4-5 రోజుల్లో అనుకూలంగా మారుతున్నాయి. బీహార్ మధ్య ప్రాంతాల నుండి దక్షిణ జార్ఖండ్ వరకు ఒక ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం మే 14, 2025న ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ/నైరుతి గాలులు వీస్తాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఈరోజు:- ——-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- ——
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- ————–
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————–
ఈరోజు, రేపు:- ————————-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- ————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :- ——————-
ఈరోజు:- ———
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- ————
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
ఎల్లుండి:- ——–
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..