AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..

అకాల వర్షాలతో ఏపీ‌ అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు కొన్ని జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
Rain Alert
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 15, 2022 | 6:56 AM

Share

అకాల వర్షాలతో ఏపీ‌ అతలాకుతలం అవుతోంది. అకాల వర్షాలకు కొన్ని జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టింది. పలు జిల్లాలో ఇంకా చిరు జల్లులు కురుస్తున్నాయి. మాండూస్‌ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వానలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

తెలంగాణ, ఏపీల్లో మాండూస్‌ తుఫాను రైతన్నలను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ళు లేక గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం పోసుకుని రైతన్నలు వాటి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు తీసుకోరు. ఏం చేయాలతో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక ధాన్యం రోడ్లపైనే కుప్పలు పోసి, ఇప్పుడు మాండూస్‌ తుఫానుతో రైతన్నలు కుదేలయ్యారు. కుండపోత వర్షాల వల్ల తీరని నష్టం వాటిల్లింది. రోడ్ల పై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోతుంటే తల్లడిల్లి పోతున్నారు.. రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.. మాండూస్‌ తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకు కోతకొచ్చిన వరి నేల వాలింది. నీటిలో నానుతున్న పంటను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాండూస్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడు తల్లడిల్లిపోతోంది. భారీ వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో వాగులు వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి..కుండపోత వర్షాలతో తమిళనాడు అతలాకుతలమైంది. మరోవైపు మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. మాండూస్‌ తుఫాన్‌తోపాటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలహీనపడి అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..