Manchu Lakshmi: పవన్‌ను టార్గెట్ చేస్తూ మీమ్.. మంచు లక్ష్మి నుంచి ఊహించని రెస్పాన్స్..

మంచు లక్ష్మి తరచూ మీమర్స్ చేతిలో ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. ఇవన్నీ ఆమె లైట్ తీసుకుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్‌తో కలిపి చేసిన మీమ్‌కు కూడా అలాగే రెస్పాండ్ అయ్యింది.

Manchu Lakshmi: పవన్‌ను టార్గెట్ చేస్తూ మీమ్.. మంచు లక్ష్మి నుంచి ఊహించని రెస్పాన్స్..
Pawan Kalyan - Manchu Lakshmi
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 14, 2022 | 3:35 PM

పవన్ కళ్యాణ్‌.. ఈ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగే. హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అపారమైన ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. నటుడిగానే కాదు.. వ్యక్తిగానూ పవన్‌ను ఆరాధిస్తారు కొందరు. ఇక ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వైరి పక్షాలకు చెందినవారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. వాటికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌కు, జన సైనికులకు నిత్యం ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హరి హర వీరమల్లు సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తూ.. ఓ పిక్ షేర్ చేశారు. దీన్ని చూసి పవన్ ఫ్యాన్స్ మురిసిపోతుంటే.. వైసీపీ కార్యకర్తలు మాత్రం మీమ్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ స్టిల్‌ను మంచు లక్ష్మి పిక్‌తో కంపార్ చేశారు మీమర్స్. పవన్ ఈ స్టిల్‌ను ఆమెను చూసే కాపీ కొట్టారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పాపం లక్ష్మిని ఎప్పుడూ ఏదో రకంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. కాగా తాజా మీమ్‌పై మంచు లక్ష్మి ప్రసన్న రెస్పాండ్ అయ్యింది.  పవన్ కళ్యాణ్ గారి పక్కన నా ఫోటో పెట్టడం నాకు సంతోషంగా అనిపిస్తోందంటూ మురిసిపోయింది. ‘గుడ్ లేదా బ్యాడ్.. ఏదైతేనేం నా ఫొటో పవన్ కళ్యాణ్ పక్కన ఉండటం థ్రిల్‌గా ఫీల్ అవుతున్నా’ అని క్యాప్షన్ పెట్టి ఆ మీమ్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. మూవీస్ మాత్రమే రీమేక్ అనుకున్నా.. ఫొటోలు కూడానా? అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. ఇక ఈ మీమ్ పోస్టు చేసిన యూజర్ నేమ్‌కి ముందు జర్నలిస్టు అని ఉండటంతో.. నువ్వు ఒక జర్నలిస్టువేనా? ఇలాంటివేనా పోస్ట్ చేసేది? ఆ రెండు ఫొటోలు ఒకేలా ఎలా కనబడుతున్నాయి? అని పవన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో